Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/701

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాని వసుచరిత్రలోవలె దీనికి వస్త్ర్యైక్యము (Unity of Plot) లేదనుట అంగీకరించక తప్పదు. ఇందలి కథ ఒక మహాఖ్యాయికకు (A great novel) తగినంత విస్తృతిని కలిగియున్నది. మనుచరిత్రయందు వృత్తము ప్రబంధ లక్షణోచితముగ లేదు. శృంగార శాకుంతలము, నైషధములందును కథ ప్రబంధములలో నుండదగిన దానికంటె విస్తృతమై యున్నది.

నామకరణము

ప్రబంధములకు, ముఖ్యముగా దృశ్యప్రబంధములకు నామకరణమొనర్చుటకు కొన్ని నియమములున్నవి. సామాన్యముగ వీని నామకరణము నాయకుని బట్టి జరుగుచుండును - మనుచరిత్ర, వసుచరిత్ర, రాజశేఖరచరిత్ర యిత్యాదులు. కొన్నిట నాయికకును ప్రసక్తి గోచరించును - తారాశశాంకము. ప్రభావతీప్రద్యుమ్ననామకరణ మీ రెండవజాతికి చెందినది. ఇందు నాయికానాయకులిరువురి నామములను కూర్చి నామకరణమొనర్చుటయందును పింగళి సూరన ప్రబంధగుణమును సాధించినాఁడు.

నాయికానాయకులు

ఇందు నాయిక ప్రభావతి, వజ్రనాభ రాక్షసుని పుత్రిక. సర్వ శుభలక్షణ సంపన్న, రూపవతి, కన్య. నీకు తగిన భర్త ఈతఁడని శివ వ్రాసియిచ్చిన చిత్రపటమునందలి ప్రియునిరూపమును చూచినది మొదలుగ, నాతని యెడల ననురాగము వహించి యాతని పరిణయమాడిన అనుకూలవతి. నాయకుఁడు ప్రబంధములందు ధీరోదాత్తుఁడు, బలము, గాంభీర్యము, కృప మొదలగున వీ నాయకునకు ముఖ్యలక్షణములు.

ఈతఁడు సర్వసామాన్యముగ దేవతామూర్తియో, సద్వంశ క్షత్రియుఁడో యైయుండును. ప్రభావతీ ప్రద్యుమ్నమున నాయకుఁడైన ప్రద్యుమ్నుఁడు యదువంశమున బుట్టిన రాజపుత్రుఁడు. జగదేకవీరుడైన శ్రీకృష్ణుని కుమారుఁడు. ధీరోదాత్తుఁడు. ఈ రీతిగా నాయికానాయకుల విషయమున ప్రభావతీప్రద్యుమ్నము ప్రబంధ లక్షణములతో నొప్పుచున్నది.

రసము

దృశ్య ప్రబంధములందు (నాటకములందు) వీర శృంగారములలో నొకటి అంగిరసముగ (ప్రధాన రసమున) నుండవలయుననెడి నియమమున్నది. ఈ


సాహిత్య విమర్శ

701