నాటకోచితరీతిలో సంభాషణల నడిపించి, తన కావ్యమునకు ఈ దృశ్య ప్రబంధ
లక్షణము నొక గుణ విశేషముగ సూరనార్యుఁడు కల్పించినాఁడు.
సమయోచిత వర్ణనలు
ప్రబంధములు వర్ణనప్రధానములు. వానియందు అష్టాదశ వర్ణనము
లుండవలయునని నియమము. ఈ నియమమును అందముగ అనుకరించి ప్రతిభలేని
ప్రబంధకవులు అనుకరణమయములైన కావ్యముల సృజించిరి. అద్వితీయ
ప్రతిభాన్వితుఁడైన సూరన వర్ణనలను సహితము అవసరోచితముగ ప్రవేశపెట్టి యా
వర్ణనములను కావ్యమునకు గుణములై యొప్పునట్లు రచించినాఁడు.
ప్రభావతీప్రద్యుమ్నమున ప్రబంధ లక్షణముల ననుసరించి పుర, ఋతు, స్త్రీ, విరహాది
వర్ణనలు కన్పట్టును. ఈ వర్ణనలను తానై వర్ణింపక, పాత్రల ముఖమున చేయించుట
సూరన విశిష్టత. ప్రభావతీప్రద్యుమ్న ప్రథమాశ్వాసము నందలి ద్వారకానగర
వర్ణనమును మాతలిచే చేయించుట ఇందుకు చక్కని నిదర్శనము. వర్ణ్యవస్తువు దొరికినది
గదా యని సందర్భశుద్ధి లేక మైమరచి వర్ణించుట సూరనయందు గోచరింపదు.
ప్రథమాశ్వాసమందలి వజ్రనాభ స్వర్గయాత్రావర్ణనము, వసుదేవుని యజ్ఞవర్ణనము
నిందుకు చక్కని నిదర్శనములు. కథకు ప్రయోజనకారులు కాని వర్ణనములిందుండవు.
కొందఱు ద్వితీయాశ్వాసమున శుచిముఖి ప్రభావతిని గూర్చి చేసిన నఖశిఖ పర్యంత
వర్ణనమును విమర్శించిరి. కాని రసిక దృష్టితో పరిశీలించిన ప్రభావతి పట్ల ప్రద్యుమ్నుని
హృదయము నాకర్షించుట కట్టి సుదీర్ఘ వర్ణన మవసరమేమో యనిపించును.
అలంకారాభిరుచి
సూరన తన కావ్యమును ప్రబంధోచిత ధోరణిని నడిపించినప్పటికిని వసుచరిత్ర,
మనుచరిత్ర, నైషధములలో వలె కావ్యమున సర్వాలంకారముల నిముడ్చవలయునను
నాతురత గలవాఁడు కాఁడు. ఈతని యలంకారములు సందర్భోచితములై, సహజములై
యొప్పుచున్నవి. ఉపమ రూపక 'ఉత్ప్రేక్ష' అతిశయోక్తి సందేహాద్యలంకారములను
సమయోచితముగ ప్రయోగించి, వానినిగూడ తన కావ్యమున గుణములుగనే సూరన
భాసింపజేసినాఁడు.
అలంకారముల నిబిడత్వము చేత శాస్త్రపాండిత్య ప్రదర్శనమున కీతఁడు పూనుకొనినట్లు కన్పట్టదు. మాతలి ద్వారకను వర్ణించుచు సందేహమును పదేపదిగాసాహిత్య విమర్శ 697