రాజ్యము పాలుకాఁగా, అళియ రామరాయలు, తిరుమల రాయలు దానిని నుద్ధరించిరి. ప్రభావతీప్రద్యుమ్నము నందలి వజ్రనాభుఁడు సకలము తిమ్మయ యనియును, సదాశివరాయ లింద్రుఁ డనియును, అళియ రామరాయ, తిరుమలరాయ, వెంకటాద్రులు ప్రద్యుమ్న గదసాంబులుగ గన్పట్టుచున్నారనియును, జాకరూకతతో పరిశ్రమ యొనర్చి వెదకినచో మిగిలిన పాత్రలకును చారిత్రకవ్యక్తులు లభింతురనియును, నిట్టి చారిత్రక సంబంధమును జూపెట్టువారి యభిప్రాయము (చిలుకూరి నారాయణరావు - భారతి. వృష శ్రావణము - ప్రభావతీ ప్రద్యుమ్నము).
ప్రభావతీప్రద్యుమ్నము - నామకరణము
వజ్రనాభవధకు సంబంధించిన రాజకీయవ్యవహారము, ప్రభావతీ ప్రద్యుమ్నుల ప్రణయవృత్తాంతమునను రెండు కథావస్తువు లీ కావ్యమున నున్నవి. ప్రబంధములు సర్వసామాన్యముగ శృంగారరస ప్రధానములై యుండుటవలనను, వజ్రనాభవధ యనెడి రాజకీయకృత్యము ప్రభావతీప్రద్యుమ్నుల ప్రణయసహాయమును పొందబడుటచేతను, కథాంతమున రాక్షసవంశ ప్రతినిధియైన ప్రభావతికిని, దేవతావంశ ప్రతినిధియైన ప్రద్యుమ్నునకును సఖ్యము చేకూరుట వలనను, సూరనార్యుఁడు తన కావ్యమునకు ప్రభావతీప్రద్యుమ్నమని నామకరణ మొనర్చినాఁడు.
ఈ కథావస్తువునే స్వీకరించి క్రీ.శ. 12వ శతాబ్దము నందు దృశ్యకావ్యముగ నొనర్చిన మలయాళ దేశరాజగు రవివర్మ, ఈ కథకు ప్రద్యుమ్నాభ్యుదయము అని నామకరణ మొనర్చినాఁడు. ఆధునిక విమర్శకు లొకరు (డా. చిలుకూరి) దీనికి శుచిముఖీవిజయమని పేరిడినచో సమంజసముగ నుండెడిదని సూచించినారు. సూరన శుచిముఖికి మిగిలిన పాత్రల కంటే విశేషప్రాముఖ్యమును కల్పించి, యా పాత్రముఖమున రాజకీయ ప్రణయకథల రెంటిని నడిపించుటచే, నా విమర్శకులిట్లు సూచించిరని భావింపవలసియున్నది. వజ్రనాభప్రళయమును తప్పించుకొనుటకై యత్నమారంభించిన ఇంద్రుఁడు కథాంతమున నాతని వధను పొందినవాడగుటచే దీనికి ఇంద్రవిజయమని నామకరణము చేయవచ్చునని కొందఱు భావించిరి. కాని శృంగారరసప్రధానమైన ప్రణయకథకే ఇందు విశేషప్రాముఖ్యమిచ్చి సూరన నడిపించుటచే, దీనికి ప్రభావతీ ప్రద్యుమ్నమను నామముగూడ సముచితముగనే యున్నదని మనము సరిపెట్టుకొనవచ్చును.
సాహిత్య విమర్శ
691