రాఘవపాండవీయమునకు పిమ్మట కీర్తిగన్న సూరన కావ్యము, 'కల్పనాచాతుర్యము నందును, కథాకథన చమత్కారము నందును నద్వితీయమైన కావ్యము' కళాపూర్ణోదయము. ఇందలి అపూర్వకథ, పాత్రపోషణమును, శైలీప్రావీణ్యమును మనోజ్ఞములు. మూఁడవ ప్రసిద్ధకృతి ప్రభావతీ ప్రద్యుమ్నము. దారిద్ర్యముచే కుందింపఁబడు కాలమున నీతఁడు శైవవైష్ణవ ప్రభువుల చిత్తవృత్తుల కనుగుణములైన కావ్యములను రచియించి, వానితో తృప్తినొందక, వార్ధక్యమున స్వతంత్రుడై తన పిత్రాది వంశవర్ణనముతో నీ ప్రభావతీప్రద్యుమ్న కావ్యమును రచియించెను. ఈ కావ్యమునందును కళాపూర్ణోదయములో వలె 'ప్రబంధ కవు లెవ్వరియందును గనఁబడని ప్రతిభయు, సందర్భశుద్ధియు, పాత్రోచితరచనయు కన్పట్టును. కాలప్రభావముచే ప్రబంధములందు సామాన్యముగ కన్పట్టు రచనారీతిని గూడ సూరనార్యుఁడు ఆదరించుట ఈ కావ్యమునందును కన్పట్టును. మహాకవి పింగళి సూరన "రాఘవ పాండవీయ, కళాపూర్ణోదయ, ప్రభావతీ ప్రద్యుమ్నములు మూఁడు నొక్కొక్కరీతి కొక్కొక్కటి సుప్రసిద్ధములై వెలసిన రత్నములు" - (కవిత్వవేది)
కళాపూర్ణోదయమును రచించువేళనే పింగళి సూర్యనార్యునకుఁ బ్రభావతీ ప్రద్యుమ్నమును రచియింపవలె ననెడి కోర్కె యున్నట్లు విమర్శకాభిప్రాయము. (డా. చిలుకూరి నారాయణరావు - 125 భారతి వృష, శ్రావణము) కళాపూర్ణోదయ కావ్యకృతిపతియైన నంద్యాల కృష్ణ భూపతిని
మ. "ఒక ప్రద్యుమ్నుని గాంచె తొల్లి యదువంశోద్భూతి పెంపొందుచున్,
సకలక్ష్మాసురులం గరంబపుడు శ్రీనంద్యాల కృష్ణక్షితీం
ద్రక రాజాన్వయసంభవంబు కతనన్ ప్రద్యుమ్నులం జేయుచున్,
బ్రకటంబయ్యెడు దానవారి యవతారం బంది ధాత్రీస్థలిన్.”
- అని వర్ణించుట యిట్టి యూహకు మూలాధారము.
ప్రభావతీప్రద్యుమ్నము - చరిత్ర
ప్రభావతీప్రద్యుమ్నము మూలమున సూరనార్యుఁడు తన కాలమునాఁటి రాజకీయ పరిస్థితులను గూడ వెల్లడించినాఁడని మఱియొక యూహ. కళాపూర్ణోదయమునకు కృతిపతి నందాల్య కృష్ణరాజు, ఇతఁడు సామంతుఁడు. ఇతని చక్రవర్తి సదాశివరాయలు. ఈ కాలమున సకలము తిమ్మయ యనెడి నిరంకుశుని దుశ్చేష్టలకు
690
వావిలాల సోమయాజులు సాహిత్యం-4