Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/686

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

11. పురము, సముద్రము, శైల, ఋతు, సూర్యోదయ, చంద్రోదయ, సరఃక్రీడా, వనక్రీడా, వసంత, రతిప్రసంగ, విరహ, పరిణయ, పుత్రోదయ, నయవిరచన, (సంధి విగ్రహాదులు) దండయాత్రా యుద్ధదౌత్య ప్రభువర్ణనములు అష్టాదశవర్ణనములు.

క.

    "పుర, సింధు, నగ, ర్త్విన, శశి
    సరసీ, వనమధు, రతిప్రసంగ, విరహముల్,
    పరిణయ, తనయోదయ, నయ
    విరచన, యా, త్రాజి, దౌత్య, విభవర్ణనముల్.”

అని కావ్యాలంకార సంగ్రహకర్త. అప్పకవి వీనికి మఱి నాల్గింటిని జేర్చి మహాకావ్యమున నిరువది రెండు వర్ణనము లుండవలె ననినాఁడు. ఇందు కొన్ని లేకున్నను మహాకావ్యత్వమునకు భంగము రాదు.

12. 'ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం'

13. నన్నెచోడుడు, కుమారసంభవము-అవతారిక.

14. "ప్రేమ అనేది ఒక పవిత్రమైన హృదయశక్తి. అది హృదయంలో అప్రయత్నంగానూ, ప్రకృతిసిద్ధంగానూ జనించేదే గాని ప్రయత్నపూర్వకంగాగానీ, మరియే ఇతర విధంగా గాని ఉత్పన్నమయ్యేది కాదు. ప్రేమించి ప్రేమింపబడే రెండు పదార్థాలకూ పవిత్రాశయాలు, హృదయ నైర్మల్యమూ, స్వార్థరాహిత్యమూ ఉండాలి, ఉండి తీరుతుంది. ప్రేమకు గమ్యస్థానం ఆనందమే. సంకుచితమైనట్టి, కేవలం విషయవాంఛలనే ప్రధానంగా గలిగిన హృదయాలలో తాత్కాలికంగా ఉత్పన్నమయ్యే అనుభవవాంఛ 'ప్రేమ' అనిపించుకోదు. దానికి పవిత్రతగాని, స్థిరత్వంగాని ఉండటం దుర్లభం. దానిని మోహం అంటారు.

ప్రవరుఁడు పవిత్రుఁడు. నిర్మలుఁడు. మహత్తరాశయం గలవాఁడు. అతని ప్రేమ బాహ్య సౌందర్యాన్ని అపేక్షింపదు. పవిత్రతాది మహత్తర గుణాలన్నవాటి నన్నింటిని అతఁడు ప్రేమించాడు. ఈ గుణాలు గల తల్లిదండ్రులను, అనుకూలవతియైన భార్యను, 'తోడునీడలై క్రీడించు' సచ్ఛాత్రులను, అతిథులను, అగ్నులను, నిత్య కర్మలను ప్రవరుఁడు ప్రేమించాడు. వీటితో హిమవన్నగానికి వెళ్లినప్పుడు ఎడబాటు కలగటం వల్ల చెప్పరాని బాధలను అనుభవించాడు. వరూధినిది మోహం. దానికి పునాది బాహ్య సౌందర్యం. ఆమె ప్రేమించినది ప్రవరుని ఆకారాన్ని. అతని 'మేనికాంతిని' అనుభవించుటయే ఆమె ఆశయం. ఆమె ప్రతి ఆశయంలోనూ విషయవాంఛ తొణికిసలాడుతుంది. వేషంలోను,