Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/685

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బరిశీలించినచో నాతఁ డా కాలప్రభావము నౌకరీతిగా నధిగమింపఁజాలెనని తోపకమానదు... ఇట పెద్దన శాంతశృంగారములకు, కర్మభోగనిష్ఠలకు, ధర్మకార్యములకు, ఆత్మేంద్రియానందములకు, సనాతనాధునాతనభావములకు విచిత్రమైన సంఘర్షణమును గూర్చి యొక యపూర్వ సన్నివేశమును సృష్టించినాఁడు." శ్రీ దివాకర్ల వేంకటావధాని - మనుచరిత్ర సందేశము భారతి మే 60 పే. 60-61

9. ఈ ముక్తకములకే తెలుఁగున 'చాటు పద్యము' లని పేరు.

10. 'సంస్కృతభాషలో దృశ్య కావ్యములందుఁదక్క శ్రవ్యకావ్యములందు వస్వైక్యము తఱచు కన్పట్టదు. శాకుంతల మృచ్ఛకటికాది రూపకములలోని యితివృత్తము ప్రధానపాత్రములగు నాయికానాయకుల వృత్తాంతముతోనే పర్యవసించును. నాటకమునం దితివృత్తమను హారమునకు నాయికానాయకులు కొలికి ముత్తెములుగా నుందురు. శ్రవ్య కావ్యమునందుఁ గొన్నిట నట్లు గాక యెక్కడకక్కడ నితివృత్తము తెంపుచెందుచున్నది.

దిలీపుని వృత్తాంతముతో నారంభింపఁబడిన రఘువంశకావ్యము అగ్నివర్ణుని వృత్తాంతముతో ముగింపఁబడుటచే వస్యైక్యము లేదు... ఆంధ్రసాహిత్యము నందు మిశ్రోత్పాద్యాన్యతరమగు నితివృత్తముతోఁ గావింపఁబడుచు వచ్చిన పెక్కు శ్రవ్యకావ్యములందు, సంస్కృత నాటక క్రమమునఁ గొంత వస్త్ర్వైక్యము గానవచ్చుచున్నది. పినవీరభద్రుని శృంగార శాకుంతలము, తిమ్మన పారిజాతాపహరణము మొదలగునవి వస్వైక్యముగలవియే.

కాని ఇట్టి వస్వైక్యము కలిగి తీరవలయు నను నిబంధన మీ తెలుఁగు ప్రబంధములపట్టున నున్నట్లు చూపట్టదు. దీనికి నిదర్శనముగా రఘువంశాది కావ్యములలో వలె మనుచరిత్రము వస్యైక్యము లేక యున్నది. ఇందు రసోత్తరముగా రచింపఁబడిన వరూథెనీప్రవర వృత్తాంతము మూఁడవ యాశ్వాసముతో ముగిసిపోవుచున్నది. నాలవయాశ్వాసమున సుపక్రమింపఁబడిన స్వరోచివృత్తాంతము ఆలవయాశ్వాసములో గొంతవఱకేగలదు. ఆవల స్వారోచిషమను వృత్తాంతముతోఁ బ్రబంధము ముగింపఁబడినది. ఇట శ్రీ వేమూరి వారి యభిప్రాయమున వస్వైక్య మనఁగా ముఖ, ప్రతిముఖ, గర్భాది పంచ సంధులతో నొప్పు కథయందలి ప్రకృష్ణ బంధమని యర్థమగుచున్నది, విశ్వనాథుఁడు దృశ్య కావ్యములలో వలె శ్రవ్య కావ్యమందును బంచసంధులను బాటింపవలెనని నిర్దేశించుట యిట గమనింపఁదగియున్నది. సాహిత్య విమర్శ 685