4. పారిజాతాపహరణ పీఠికాభాగమున (కృత్యాదిని) నంది తిమ్మన శ్రీకృష్ణరాయల పూర్వదిగ్విజయయాత్రలో కొండవీటి విజయము వఱకే వర్ణించియుండుటచే నది క్రీ.శ. 1516న రచింపఁబడి యుండుననియును, మనుచరిత్రలో రాయల పూర్వదిగ్విజయయాత్ర సంపూర్ణముగా వర్ణింపఁబడుటచే నది క్రీ.శ. 1519 తరువాత నల్పకాలమున రచింపఁబడవలెనని శ్రీ కుందూరి ఈశ్వరదత్తు నిర్ణయము. ఈ మతమున నాంధ్ర పంచకావ్యములలోఁ పారిజాతాపహరణమే తొలి కావ్యమగుచున్నది. - ఆంధ్ర పత్రిక - సంవత్సరాది సంచిక - ప్రమోదూత పే. 101-104
5. 'ఆంధ్ర భాషయందుఁ బెక్కులు ప్రబంధము లుప్పతిల్లినను వానిలోఁ బ్రధానము లనియు నుత్తమోత్తమములనియుఁ బండితు లొకరీతిగాఁ బేర్కొనునవి మనుచరిత్రము, వసుచరిత్రము, ఆముక్తమాల్యద, పారిజాతాపహరణము, శృంగార నైషధము అను నీ యేను కావ్యములు. ఇవియే తెనుఁగున పంచ మహాకావ్యము లనఁబడును. కొందఱు శృంగార నైషధమునకు మాఱుగాఁ గాశీఖండమును, కొందఱు పాండురంగ మాహాత్మ్యమును, మఱికొందరు రాఘవ పాండవీయమును నెన్నుదురు. కాని మొదటి నాలుఁగు కావ్యములను గూర్చి పండితులలో భేదాభిప్రాయము లేదు - (పారిజాతాపహరణ పీఠిక - శ్రీ నాగపూడి కుప్పుస్వామయ్య. పే. 5)
6. "ఇచట (కథారంభమునందు) ఉత్తర కథావిస్తృతికి బీజములగు ప్రవరుని సౌందర్య సంశ్రిత ప్రతిత్వములు గవి నిపుణముగా నుంచినాఁడు. వాని చక్కదనమునందు వరూధినీయత్న వైయర్థమునకు మొదటి హేతువగు ప్రవర్ధ వైరాగ్యమును రూపించినాఁడు. - తం. తేవప్పెరు మాళ్ళయ్య
7. మనుచరిత్రమున శృంగారమే అంగిరసమనియు నొక యభిప్రాయ మున్నది.
8. ప్రబంధములలో ప్రధానరసము శృంగారమైయుండుట సహజము. ఈ సందర్భమున "పెద్దన ప్రబంధ కవుల కాద్యుఁడును, మార్గదర్శకుఁడును. కాల ప్రభావమును బట్టియు నభిరుచి విశేషములను బట్టియు నా యుగమునందలి పలువురు కవులు శృంగారమునే ప్రధానరసముగా గ్రహించిరి. పెద్దనయు మనుచరిత్రమున దానినే యాభాస వియోగ సంభోగ రూపముల వైవిధ్యముతోఁ బోషించెను. ఆరంభమున దానికి శాంతముతో సంఘర్షణము కలిగించియు సంతమున మనుతపోఘట్టమున నచ్చమైన శాంతమును వర్ణించియు నాతఁడు కావ్యమున కపూర్వశోభ కల్గించెను. ఈ సన్నివేశములను సూక్ష్మముగాఁ 684 వావిలాల సోమయాజులు సాహిత్యం-4