ఈ కాలధర్మములు కవి కావ్యములందెట్లు ప్రతిఫలింపకుండగలవు?
సామాన్యముగ రాజ్యము, మతము, శాస్త్రము, శిల్పము మొదలగునెల్ల
విషయములందును మనుష్యశక్తియొక్క పరాకాష్ఠను జూపఁగోరు సమయమున,
సన్నివేశమున కవులుమాత్రము ముద్దుగ, మృదువుగ, రసమయముగ, పూవులవలె
నక్కరకు వచ్చినప్పుడు ముడిచినను, అక్కరమాలినపుడు త్రోసివేసినను
సహించుకొని పేడులయి కేవలాధ్యాత్మిక తృప్తితో కాలము గడుపుట సాధ్యమా?
కావున వారును పురుషసింహు లగుటకు యత్నించిరి. అంతకుఁ బూర్వ
మైదునూర్ల సంవత్సరముల ఆంధ్ర సాహిత్యము యొక్క జీవనమున సంస్కృత
సాహిత్యమహిమలో స్వల్ప స్వల్పముగ కనఁబడుచువచ్చిన చమత్కార ప్రధాన
రచన రాయలకాలమున బాగుగా పెరిగి వేరుని తరువాతి కవులకు
మార్గదర్శకమాయెను. చిత్రకవిత, బంధకవిత, గర్భకవిత, ఆశుకవిత యని
నాల్గు రకములుగా పద్యరచన ప్రసిద్ధమాయెను. రాయలయాస్థానమున ప్రధాన
కవియైన పెద్దన్న తన కీ 'చతుర్విధకవితామతల్లి' స్వాధీనమని చెప్పుకొనియున్నాడు.
సంస్కృతాంధ్రములందు సమానముగ నాశుకవితఁ జెప్పగలిగినందుననే గండ
పెండేరమును రాయలాయన కాలికిఁ దొడిగినాడట! రాయల కంకితము చేసిన
మనుచరిత్రములో నిటువంటి కుస్తీ కవనపు ప్రసంగమే లేకపోయినను దాని
నభ్యాసము చేసియుండనిచో కవిపండిత సమాజమున నాతనికి మర్యాద
దొరకియుండదని ధారాళముగాఁ జెప్పవచ్చును. కఠిన సమస్యల నిచ్చుటయు
ఆకస్మికముగ జూచిన వస్తు సన్నివేశములను గూర్చి కవనము జెప్పఁగోరుటయు,
తృప్తికరముగ నట్లు చేసినవారికి బాగుగా సన్మానము చేయుటయు నప్పటి
సామాన్య రాజసభాసంప్రదాయములుగ నుండెను. అందువలనఁ గత్తిబట్టిన
శూరునకును, కలము బట్టిన ధీరునకును ఉత్సాహమున భేదముండలేదు.
రసరంగములును, రణరంగములును నేకరీతిగ నుద్రేకదాయకములై యుండెను.
అందుచే కవిశూరులు వీరాలాపములును సింహనాదములును ప్రాయశః ఆ
కాలపు ప్రతి కావ్యము నందును వినరా నారంభించినవి... ఇటువంటి
సమయమునఁ బుట్టిన కావ్యములు నిస్సారములుగ నీరసములుగ నుండ
సాధ్యము కాదు. జీవనము నిండారి పొంగులు వారుచున్న సమయమున కేవల
నిర్జీవ రచన ఎట్లు తలచూపును? - రాయలనాఁటి తెలుగు సాహిత్యము.
భారతి : ధాత : మాఘము.
-
శ్రీ నిడుదవోలు వేంకటరావు ప్రథమాంధ్ర కవితా పితామహుఁడు: శివదేవయ్య
- భారతి పార్థివ, ఫాల్గునము.సాహిత్య విమర్శ
683
పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/683
స్వరూపం
ఈ పుటను అచ్చుదిద్దలేదు