ప్రకృతి పరిజ్ఞానము, సంభాషణ విరచనము మొదలైన వివిధాంశముల గ్రహించి విమర్శ యొనర్చుట ప్రధానముగా నిరువదియవ శతాబ్దియందే పుట్టినదని చెప్పునొప్పును. అంతమాత్రము చేత మన ప్రాచీనులకుఁ గావ్యవిమర్శ లేదనరాదు. కావ్యపరిశీలనమున వారి దృష్టి వేరు. విద్వదోష్ఠులలో వారు కావ్య విమర్శ యొనర్చెడి వారు. కవులు, పీఠికలందు వారి కవితాగుణములను గూర్చి చెప్పుకొనుటయు కలదు.
నన్నయ తన కవితలో 'నానా రుచిరార్థ సూక్తినిధిత్వము', 'అక్షర రమ్యత'లున్నవనుటయు, తిక్కన తాను "శిల్పమున పారగుఁడ" ననుటయు నిట్టివి. శ్రీనాథాది మహాకవులను “వచియింతు వేములవాడ భీమనభంగి నుద్దండలీల నొక్కొక్కమాటు” ఇత్యాదిగాఁ చాటువులందు జెప్పికొనినారు. రాయలనాటి కవుల విషయమునందును నిట్టి విమర్శక వాక్యములు కొన్ని పుట్టినవి. ప్రబంధయుగ కవితాపితామహుడైన అల్లసాని పెద్దనార్యుని గూర్చి మనుచరిత్ర కృత్యాదిని 'శిరీష కుసుమ పేశల సుధామయోక్తులఁ గవితఁజెప్పు' మని రాయలు కోరినట్లుగాఁ గన్పట్టుట ఇట్టి జాతిలోని విమర్శ. పెద్దనార్యునికిఁ దరువాత దరిదాపుగ రెండు శతాబ్దములకుఁ బుట్టిన కవి చౌడప్ప పెద్దన కవితను గూర్చి చెప్పిన చాటువు "పెద్దనవలె గృతి చెప్పిన పెద్దనవలె, నల్పకవిని బెద్దనవలెనా? యెద్దనవలె మొద్దనవలె గ్రద్దనవలెఁ గుందవరపు కవి చౌడప్పా!” అనునదియు నిట్టిది.
పెద్దన కవితను గూర్చి ప్రాచీన కాలముననే పుట్టిన మరియొక విమర్శక వాక్యమున్నది. మూర్తికవి కవిత్వమును విమర్శించుచు తెనాలి రామకృష్ణుఁడో లేక మఱియొక కవియో చెప్పినట్లుగా వ్యాప్తిలోనున్న -
ఆ.వె. “అల్లసానివాని యల్లిక జిగి బిగి
ముక్కుతిమ్మనార్యు ముద్దుపలుకు
పాండురంగవిభుని పదగుంఫనంబును
గాక మానురాయ నీకు తగుర!"
అన్న చాటువులోని 'అల్లసానివాని యల్లిక జిగిబిగి' యన్న వాక్యమిది. అల్లసాని పెద్దనార్యుని కవితలో 'నల్లిక జిగిబిగి' యున్నదని సమకాలిక కవులు గుర్తించినట్లు దీనివలనఁ దేటపడుచున్నది.
అల్లసాని పెద్దన మనుచరిత్రలోని కవిత్రయం 'దల్లిక జిగి బిగి' యున్నదనుట యంగీకరింతము. ఈ విమర్శక వాక్యము శబ్దప్రయోగ విషయమున పదముల
678
వావిలాల సోమయాజులు సాహిత్యం-4