తీర్థమాహాత్మ్యముల నడుగుటను, 'పోవలయు చూడవలయు' నని యువ్విళ్ళూరుటయునుఁ గల్పించినాఁడు. ఈ సందర్భమున పెద్దన చెప్పిన 'తీర్థసంవాసు లేతెంచినారని విన్న' అన్న పద్యభావమంతయును మూలములో లేనిది. రసోద్వేల మైనది. అతి సహజమైనది. ప్రవరుని మనఃప్రవృత్తికిఁ బ్రతిబింబమువంటిది.
ఇట్లు అభ్యాగత సేవాపరతంత్ర సకలజీవనుఁడై ప్రవరుఁడు కాలము గడుపుచుండఁగా, ఔషధసిద్ధుఁడొకఁడు అరుణాస్పదపురమునకు వచ్చుచున్న వార్త ప్రవరుఁడు విని యెదురేగి, 'ముడిచిన యొంటి కెంజెడ మూయు మువ్వన్నె మెకముతోలు కిరీటముగ ధరించి' ఇత్యాది రూపములతో నపరశివావతారముగ వచ్చిన సిద్ధుని చినాఁడు.
పెద్దన 'మున్ముందు ప్రవరుఁడు తన తీర్థసందర్శనాభిలాషను తీర్చఁగల పరమయోగీంద్రుఁ డనుభావముతో శరణుజొచ్చి తరణోపాయమర్ధింప' దగిన పరమయోగీంద్రునిగా, ప్రథమ దర్శనవేళనే భక్తి కుదురుకొనిన ప్రవరుని కన్నులతో మహానందమునఁ జూచినట్లుగా నాతని వర్ణించినాఁడు. పరమవైష్ణవ భక్తాగ్రేసరుఁడైన పెద్దనకు ప్రసన్నభావము నిత్య పరిచయమైనదిగదా! ఈ యోగీశ్వరవర్ణనము సమయోచితము, సహజము, మనోజ్ఞము.
ప్రవరుఁడు యోగీశ్వరున కాతిథ్యాదికమును నడిపి సదాచారమెఱిఁగిన విజ్ఞాని గావున చేరవచ్చి 'యన్మనీషి పదాంభోజ రజఃకణ పవిత్రతం తదేవ భవనం' -మహాత్ముల రాకచే గృహము పావనమగు' అన్న ఆర్యోక్తి నెఱిఁగియుండుటచే 'మీ రాకచే నా గృహము పావనమైనది. నేను పవిత్రుఁడనైనాను' అని సంభాషణ మారంభించినాఁడు. 'భాషాపరశేషభోగి' యైన యాతఁడు నేర్పుతో భక్తి యుట్టిపడ పొగడ్తగాని పొగడ్తగా యోగీంద్రుని మహిమలు జెప్పి స్తుతించి, తీర్థయాత్రా ప్రశ్నమునకు అవతారికగా నిట్లు పలికినాఁడు.
తే. “మౌనినాథ! కుటుంబ జంబాలపటల మగ్న మాదృశ గృహమేధిమండలంబు నుద్ధరింపంగ నౌషధ మొండుగలదె యుష్మదంఘ్ర రజోలేశ మొకటి దక్క?"
'ఇందలి వినయానుసంధానము, భక్త్యతిశయము, భాషాచమత్కృతి మిక్కిలి హృదయాకర్షకములు'. పిమ్మట సిద్ధుఁడు 'మావంటి తైర్థికావళి కెల్లన్ మీవంటి గృహస్థుల సుఖజీవనమున గాదె తీర్థసేవయు' నని పల్కి తీర్థసేవాప్రస్తావమునకు
సాహిత్య విమర్శ
675