శ్రీ కుంటిమద్ది శేషశర్మ - ప్రవర నిగమశర్మలు - (భారతి - పార్థివ - కార్తికము). పెద్దన 'కవీనాం కవి' (The Poet's poet).
సిద్ధప్రవర సంవాదము
ప్రబంధయుగ స్థాపనాచార్యుఁడును, ఆంధ్రకవితా పితామహుఁడునైన పెద్దనార్యుని మనుచరిత్రమున ప్రథమ రసవత్తర కథాసన్నివేశ మీ సిద్ధప్రవర సంవాదము. ఈ ఘట్టమును పెద్దనార్యుఁడు కడు సమర్థతతోను, శ్రద్ధతోను, రచించినాఁడనుటకు క్రింది విమర్శక వాక్యములు నిదర్శనములు. “ఈ సిద్ధప్రవర సంవాదమున భక్తి కరుణారసోల్లసితములగు రచన లతి ప్రౌఢములును, స్వభావోక్తి లలితములునగును. ప్రవరుని వినయాచిత సంభాషణ వైదుష్యమును, కరుణారసోద్దీపకమగు సూక్తి నైపుణ్యము నగ్రగణ్యములు. ఇవియ వాని 'భాషా పరశేషభోగిత్వ' మును బట్టి యిచ్చుచున్నవి. సిద్ధుని గార్హస్థ్యవర్ణనమును హృదయంగమము” తేవప్పెరుమాళ్ళయ్య.
తీర్థ సందర్శనాభిలాషియైన అరుణాస్పదపురవాసియగు ప్రవరుని ఇంటికొక సిద్ధుఁడు విచ్చేసి పాదలేపనమను దివ్యౌషధమును ప్రసాదింపఁగా, దాని దివ్యశక్తిచే ప్రవరుఁడు హిమవంతమునకుఁ బ్రయాణమగుట ప్రథమాశ్వాసమందలి కథ.
పెద్దన మహాకవి సిద్ధుఁడు ప్రవరుని ఇంటికి రావలయునన్నచో నాతని కతిథి సంతర్పణ గుణముగా నుండవలసివచ్చుటయు, అతిథి సంతర్పణము నిరంతరాయముగ సాగవలసి యుండుటచే ధనాఢ్యత, సదాచారసంపత్తి, వ్రతదీక్షాపరత్వము మొదలైన గుణ విశేషములు తన ప్రవరున కవసరములనియు గమనించుటచేత, తొలుతగా ప్రవరుని వర్ణించినాఁడు. అతని పాడిపంటలను వర్ణించినాఁడు. అతని ధర్మపత్నియైన సోమిదేవి అనుకూలవతి కాకున్న నా ప్రవరు నాధిపత్యప్రియత్వము కొనసాగదు గావున నన్నపూర్ణకు ముద్దియైన ఈమె యన్నదానగుణమును వర్ణించి సిద్ధుని రాకకు ఉపపత్తిని కల్పించినాఁడు.
ప్రవరునకు హిమాచలమునకుఁ బోవలయుననెడి కోర్కె చిరకాలమునాఁడే కల్గినది. ఆ కోర్కె చల్లారకుండుటకు ఉత్తేజములు, ఉద్బోధకములు అవసరముగదా! ఈ రహస్య మెఱిగి పెద్దన "తీర్థ సంవాసు లేతెంచినారని విన్న” అన్న పద్యమును, నీతఁడు తీర్థ సంవాసులు వచ్చినారని విన్ననెంతదూరమైన నేగి భక్తితో వారి నింటికిఁగొనివచ్చి ఆతిథ్యమిచ్చి, యిష్టాన్న సంతృప్తులను గావించిన పిమ్మట సకల
674
వావిలాల సోమయాజులు సాహిత్యం-4