మనోజ్ఞమూర్తి' (మన్మథ చంద్రులవలె రమణీయమైన రూపము గలవాఁడు) అనియు, అలేఖ్య తనూవిలాసుడనియు (చిత్రింపరాని రూపరేఖలు గలవాడు) జెప్పినాఁడు.
'సమ్మోహనకరమైన ఇట్టి రూపముగలవాఁడగుట వలననే' నితని నరుణాస్పద పురమందలి జారకామినులెందరో వలచుట సంభవించినది. ఇతని శరీర సౌందర్యము కేవలము మర్త్యభామినులనే కాక, వరూథిని వంటి దేవకాంతను సహితము మరులు కొల్పఁజాలినది.
ఈతని జూచిన మరుక్షణముననే ఆమె 'ఎక్కడివాఁడొ యక్షతనయేందు జయంత వసంత కంతులన్ జక్కదనంబునన్ గెలువఁజాలెడు వాఁడు మహీసురాన్వయం బెక్కడ? ఈ తనూవిభవ మెక్కడ?' అని యబ్బురపడినది. దేవలోక మందలి పురుష సౌందర్యమంతయు నీతని రూపసౌందర్యము ముందు దిగదుడుపే యని నిశ్చయించినది. ఈతని రూపమే వరూథినిని వలపించి చులకన చేసినది. కఠిన వ్రత దీక్షల చేతను యజ్ఞయాగాది క్రియలుధర్మ నిర్వహణముల చేత నీ సౌందర్యము వాడిపోకుండుట విశేషము. ప్రవరుని యపురూపమైన సౌందర్యమంతయును నొకవేళ నామెకు దానిపై దృష్టియున్నను నది యీతని ధర్మపత్నియైన సోమిదేవికి తక్క నితర జారస్త్రీలకు భోగబాహ్యమైనది. ఇందు కీతని వైరాగ్యమే కారణము. ఈ యంశమునే పెద్దన మనోజ్ఞముగ -
ఆ.వె. 'వాని చక్కఁదనము వైరాగ్యమునఁ జేసి
కాంక్షచేయు జార కామినులకు
భోగ బాహ్యమయ్యె పూచిన సంపెంగ
పొలుపు మధుకరాంగనలకుఁబోలె.”
అని వర్ణించినాఁడు.
ప్రవరుఁడు ప్రణయతత్త్వము, భోగములను ఎఱుఁగనివాఁడు కాఁడు. ధర్మబద్ధుఁడు. ఇతఁడు తన తృతీయ పురుషార్థమునకు (కామమునకు) తన తల్లిదండ్రులు సంతోషముతోఁ గూకటులు కొలిచి చేసిన కూరిమి సోమిదమ్మ నొక్కతెనే సాధనముగ గ్రహించినాఁడు. అనఁగా నితని ప్రణయమేకపత్నీవ్రత పర్యవసిత మన్నమాట! ఆమె అనుకూలవతి. పతిదేవత. ఇతనిని సౌఖ్యావహయై భజించినది. ఇతని ఆతిథ్యతత్పరత్వము నెఱిఁగి అర్ధరాత్రమున వేవురు వచ్చినను వండనలయక వారికిష్ట మృష్టాన్న భోజనముల నిడి సంతృప్తులను గావించి, భర్తకు
సాహిత్య విమర్శ
671