Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/665

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రంథారంభ మొనర్చినారు. గాని వారి కావ్యములందును మంగళాచరణాది అవతారికా విశేషములు గన్పట్టవు.

ఆంధ్రకవుల యవతారికాభాగమును శ్రీకారములతో నుపక్రమించుట, మంగళాచరణము, దేవతాస్తుతి, పూర్వకవి స్తుతి, కవితాలక్షణము, కుకవి నింద, సుకవి ప్రశంస, కృతిపతి ప్రశంస, కృతికర్త కృతిభర్తల యుభయవంశాభివర్ణనము, షష్ఠ్యంతములు అనునవి ముఖ్యముగ నుండఁదగిన యంశములైనవి. ఇందులో నే యొక్కటి తక్కువయైనను ప్రబంధము కాదేమోయన్న భయముతో, గవులెల్లరు నీ నియమములను బాటించినట్లు కన్పింతురు. ఈ కృత్యాదులలో, గొందఱకు స్వప్నములు వచ్చి ఫలాని గ్రంథమును ఇష్టదైవము తనకో లేక పేరుపెట్టి యొక రాజునకో యంకితమిమ్మని జెప్పిపోఁగా నంతట నా కవి శ్రీకారమునుజుట్టి గ్రంథరచన మారం భించినట్లుండును. లాక్షణికులును నీ కృత్యాదులకుఁ గొన్ని నియమముల నేర్పరచినారు.

ఈ అవతారికాభాగములు కాలక్రమమున పై లక్షణముల నెల్ల సంతరించుకొన్నట్లు పరిశీలనవలనఁ దెలియును. వీరివలన నాయాకవుల కవితా లక్షణోద్దేశాదులు, దేశకాల పరిస్థితులు, చారిత్రకాంశములు మొదలగు కొన్ని విశేషములు తెలియుచున్నవి.

మహాకవి పెద్దనార్యుని మనుచరిత్రమునందును దీర్ఘమైన యవతారికయున్నది. ఇందును స్వప్నము తప్ప మిగిలిన కృత్యాది లక్షణములన్నియుఁ గన్పట్టుచున్నవి.సకల శ్రేయస్సాధనమైన కావ్యమును జెప్పఁబూనినవాఁడై పెద్దనార్యుఁడు ఆశీర్వచనము,మంగళాచరణము, వస్తు నిర్దేశములలో నొకదానితోఁ గావ్యారంభ మొనర్పవలయుననెడి నియమము (ఆశీర్నమస్క్రియా వస్తునిర్దేశో వారి పి తన్ముఖమ్) ననుసరించి పెద్దన, “శ్రీ వక్షోజకురంగనాభమెదపైఁ జెన్నొంద" ఇత్యాదియందు ఆశీర్వాదరూపమైనమంగళముతో కావ్యారంభ మొనర్చినాఁడు.లక్ష్మీస్తనకస్తూరిని జూచి భూదేవియని మునులు భ్రాంతినొందినట్లుగాఁ గల్పించి, గంధర్వుఁడు వరూథినికిఁ బ్రవరుఁడు గాఁదోచుటకు సూచన గావించి కావ్యారంభ శ్లోకమున 'కావ్యార్థ సూచన మొనర్పవలయు' నన్న నియమమునుగూడఁ బెద్దన పాటించినాఁడు.

కావ్యారంభమును శ్రీకారముతో నొనర్పవలయునని మఱియొక నియమము. ఈ విషయమును అప్పకవి తన లక్షణ గ్రంథమున "పదపడి శ్రీకారము కృతి మొదల నిలిచి దోషపుంజము నడంచి శుభం, బొదవించుఁ బరుసమినుమును, గదిసి



సాహిత్య విమర్శ

665