Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/664

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దండయాత్ర సందర్భమున రాయల సైన్యమును గూర్చి 'ధర కెంధూళులు', 'పుంఖాను పుంఖ' (1-43) లలో నెంతయో అతిశయోక్తియున్నట్లుగా పెద్దన వర్ణించినాఁడు. కాని చరిత్రల వలననే రాయరాణువలో 24 వేల గుఱ్ఱములు, 15 వేల ఏనుఁగులు, 2 లక్షల కాల్బలము నున్నట్లు చెప్పఁబడినది. కావున పెద్దన వర్ణించినంతటి ఘనమైన సైన్యముతోనే రాయలు దిగ్విజయములను సాగించినాఁడని భావింపవలసియున్నది.

లోకమున కృష్ణరాయలు కవితాప్రియుఁడే గాని స్వయముగ కవిగాఁడనియును, పెద్దనార్యుఁడే ఆముక్తమాల్యదను వ్రాసి రాయలపేర వెలయించినాఁడని యొక ప్రథయున్నది. అది యసత్యము. పెద్దనయే రాయలను గూర్చి 'కవితాస్త్రీ లోలుఁ' డనినాఁడు.

'భోజక్షమావిద్యాపరిపాక' అనుటయు, తిమ్మన 'కవితా ప్రావీణ్యఫణీశ' అనుటయు రాయలు భోజునివలె విద్వత్కవియనియే తెలియఁ జెప్పుచున్నవి. కావున రాయలు కవీంద్రుఁడనుట చారిత్రక సత్యము. ఇట్టివానిని గాక పెద్దన 'ఒకరి నొక పనికై నియోగించునపుడు కర్పూరతాంబూలమిడుట', మాన్యక్షేత్రములిడుట మొదలైన సాంఘికాచారములను, 'చేర్చుక్క', 'గండ పెండేరము' మొదలగు నా కాలమునాఁటి యాభరణాద్యలంకారములను, వేశ్యాదికముచే నా కాలమునాఁటి సాంఘిక వర్ణాశ్రమాచారాదికములను తన మనుచరిత్ర పీఠికయందును, నితర గ్రంథమునందును దెలియఁజేసినాఁడు.

కృత్యాది విశేషములు

(అవతారికాభాగ విశేషములు)

కృతులకు అవతారికలను జెప్పుట ఆంధ్రకావ్యములలో నొక విశేష లక్షణముగఁ గన్పట్టుచున్నది. సంస్కృత సాహిత్యమున నిట్టి సంప్రదాయము లేదు. వాల్మీకి రామాయణము వస్తునిర్దేశపూర్వకముగ నారంభమైనది. మహాకవి కాళిదాసు, కుమారసంభవ, మేఘ సందేశములను కావ్యములను వస్తునిర్దేశముతోనే యారంభించినాఁడు. రఘువంశమున మాత్రము పార్వతీపరమేశ్వరులకు "వాగర్థా వివసంపృక్తా" ఇత్యాదియందు నమస్కరించి పిమ్మట తన వినయమును జెప్పుకొనినాఁడు. భారవి, మాఘుఁడు మొదలైన మహాకవులును వస్తు నిర్దేశముతోనే


664

వావిలాల సోమయాజులు సాహిత్యం-4