Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/659

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కావ్యజాలమును జెప్పిరి. తమ పోషకులైన రాజన్యులకుఁ దమకావ్యములనంకితమొనర్చిరి. అందుచే వారు కావ్యకృత్యాదియందు ఆయా రాజన్యుల వంశచరిత్రములను, వారొనర్చిన జైత్రయాత్రలను గుణవిశేషములను ప్రాస్తావికముగ వర్ణించుట పరిపాటియైనది. కావ్యములందలి ఈ పీఠికాభాగములలో అభిమానపూరితములైన అతిశయోక్తులెన్ని యున్నను వానినుండి చారిత్రక సత్యములను గనుఁగొనుట కష్టము కాదు. ఈ కారణముననే చరిత్ర రచనకు సమకాలిక సాహిత్యము (Contemporary Literature) నొక ప్రముఖాధారముగా (Important Source) చరిత్రకారులు గ్రహించుట సంభవించుచున్నది.

నన్నయ భారతమువలన తూర్పుచాళుక్య చక్రవర్తియైన రాజరాజనరేంద్రుని పరిపాలన కాలమునందలి విశేషములును, తిక్కన నిర్వచనోత్తర రామాయణము వలన నెల్లూరు తెలుఁగు చోళుల చరిత్రను, ఎఱ్ఱన హరివంశమువలన రెడ్డిరాజ్య స్థాపనాచార్యుఁడైన ప్రోలయ వేమారెడ్డి కాలమునాఁటి విశేషములను, శ్రీనాథుని రచనలవలన కొండవీటి, రాజమహేంద్రవర రెడ్డిరాజులనాఁటి పరిపాలన విశేషములను దెలిసికొనుట కవకాశము లభించుచున్నది. ఇట్లే క్రీ.శ. 1509 మొదలు 1530 మధ్యకాలమున విజయనగర సామ్రాజ్య వజ్రసింహాసన మధిష్ఠించి దక్షిణాపథము నెల్ల నేకచ్ఛత్రాధిపత్యముగఁ బాలించిన శ్రీకృష్ణరాయల కాలమునఁ బుట్టిన పారిజాతాపహరణ మనుచరిత్రాది మహాకావ్యములవలనను నా మహారాజ వంశమును గూర్చిన విశేషములును, నా రాజన్యుని గూర్చిన కొన్ని విశేషములును దెలియవచ్చుచున్నవి.

మనుచరిత్రయందు పెద్దన యొనర్చిన కృతిపతియైన కృష్ణరాయ వంశవర్ణనమువలన రాయలవంశమునకు సంబంధించిన విశేషములు, రాయల ప్రతాపాదివర్ణనము వలన నాతని జైత్రయాత్రలు కొన్నియుఁ దెలియుచున్నవి.

పెద్దనార్యుఁడు కృష్ణరాయలు చంద్రవంశమందలి తుర్వసుని కులమునఁబుట్టినట్లు చెప్పియున్నాఁడు. 'వాని వంశంబు' (ప. 22) అనుదానియందు తుర్వసుని వంశమే తుళువాన్వయమైనట్లు చెప్పినాఁడు. తిమ్మన పారిజాతాపహరణమందును కృష్ణరాయలను చంద్రవంశ క్షత్రియునిగనే చెప్పినాఁడు. కాని కృష్ణరాయని వర్ణించుచు 'యాదవాన్వయము'నఁ బుట్టినట్లు వర్ణించినాఁడు. తుర్వసుని వంశస్థులు యాదవులగుట కవకాశము లేదు. అదియును గాక తుర్వసుని వంశజులు తౌర్వసులు కావలయును గాని తుళువలు కాఁజాలరు. కృష్ణరాయల కాలమునఁబుట్టిన 'నేర్లకెరె'


సాహిత్య విమర్శ

659