Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/657

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భరించుచున్న ఆదివరాహమూర్తి కోఱ, ఆదిశేషుని పడగలమీఁది మణులనెడి తాళ్ళు, కులపర్వత శిఖరములమీఁది శిలలు ఒరసికొనుటచే, శరీరమంతయును గంట్లేర్పడిన భూదేవి నా కృష్ణరాయలు తన భుజముననే ధరించుటచేత, దానియందుఁ బూయఁబడిన కస్తూరికాద్యలేపములు చిక్కగ నంటుకొనుటచే నా గంట్లు పూడి భూదేవి యథారూపమును ధరించినది.

కృష్ణరాయల శత్రురాజుల పట్టణములు అతని దండయాత్రలచే పాడువడి కాఱడవులై పోయినవి. అందు వసించుచున్న యడవి యేనుఁగులు అచ్చట చెడియున్న మేడల గోడలను దంతములతోఁ బడఁగొట్టుచుండఁగా, వానినుండి వ్రాలిన వజ్రములను జూచి గిజిగాడులను బంగారు పిచ్చుకలు మిణుఁగురుబురుఁగులను భ్రాంతి వహించి కొనిపోయి రాత్రులందు వెలుతురుకై తమ గూండ్లలో నుంచెను.

ఎగరేగుటకై వెల్గింపఁబడిన తోకచిచ్చనునట్లుగా పిమ్మట నొప్పిన కృష్ణరాయల భుజపరాక్రమమనెడి ప్రజ్వలించు నగ్ని, తొలుత ఉదయగిరియనెడి చెకుముకితాతిని దగిలి వేడిఁగొన్న ఖడ్గమనెడి యుక్కువలన జన్మించినది. ఆ పిమ్మటఁ గొండవీడు నెక్కి యట నలియైన కసవాపాత్రుఁడను రాజునంటి రగుల్కొనెను. అటుపిమ్మట జమ్మిలోయ యను జమ్మును వేగముగా దహించెను. కోనయను మన్నెము నంటఁ గాల్చెను. కొట్టమను దేశమునంటుకొని కనకగిరి యనెడి దుర్గపుటతిశయమును గరఁగించెను. గోదావరిని క్రాఁగించెను. ఆ పిమ్మట పొట్టనూరను పట్టణమునందుఁ బ్రజ్వలించెను. మాడెములను బ్రేలఁజేసెను. ఒడ్డాదియను పట్టణమును బూడిద గావించెను. తుదకు గజరాజు (గజపతియను రాజు) భయపడి పారిపోవఁగా కటకమును మసియొనర్చెను.

కృష్ణరాయల భయమువలన నాతఁడు దండెత్తివచ్చుటకుఁ బూర్వమే స్వరాష్ట్రమును విడిచి వింధ్యపర్వతగుహలలో నివసించు వీరభద్ర గజపతియొక్క లోకమెఱుఁగని యంతఃపుర స్త్రీలు (శుద్ధాంత ముగ్ధాంగనలు), రాయల సేనలు దండు వెడలుటచే రేగిన యెఱ్ఱని ధూళి తాము నివసించుచున్న గుహలను దట్టముగాఁ జుట్టుకొనఁగా 'ఇది యేమో, యెఱ్ఱని వింతయైన చీఁకటి క్రమ్ముకొన్న' దాని యొకరికొకరు చెప్పుకొనుచు చూచెదరు.

కృష్ణరాయలు తన విజయవార్తలను జెక్కించి తాళప్రమాణమైన జయధ్వజరూపమగు శాసనశిలను పొట్టునూరికడ ప్రీతితో నిల్పినాఁడు. సింహాచల నృసింహస్వామి యుత్సవములను జూచుటకై స్వర్గమునుండి వచ్చు దేవతలు,


సాహిత్య విమర్శ

657