కాహారముగా నిచ్చి పోషించువాఁడును, కటిక చీఁకట్లను దనకరములచేఁ గలువలను
వికసింపఁజేయువాఁడును, లక్ష్మికిఁ దోడఁబుట్టువును, పదియాఱు కళలకును
చోటయినవాఁడును, అశ్విని మొదలైన నక్షత్రములకు భర్తయైనవాఁడును, కాంతికి
నిధియును, సూర్యునికి జతకాఁడును నైన చంద్రుఁడు లోకములఁ బొగడ్త
నొందుచుండెను. అతనికి వేదవేదాంగాది విద్యల నెల్ల నేర్చిన బుధుఁడు కుమారుఁడై
జన్మించెను. ఆ బుధునకు పురూరవుడు, నాతని కాయువును, ఆయువునకు యయాతి
మహారాజును జన్మించిరి.
యయాతికి యదుతుర్వసులను నిరువురు శత్రుంజయులు, విద్యావేత్తలు నయిన
పుత్రులు పుట్టిరి. వీరిలో తుర్వసుఁడు సద్గుణఖనియై ప్రఖ్యాతకీర్తి వహించినాఁడు.
ఈ తుర్వసుని వంశమే ‘తుళువ వంశ' మని పేరు పొందినది. అందు అసంఖ్యాకులైన
రాజులు జనించి సాటిలేని కీర్తిచేఁ బ్రసిద్ధి నొందిరి. పిమ్మట నీ తుళువ వంశమున
తిమ్మరాజు జన్మించెను.
ఈ తిమ్మరాజు గొప్పవాఁడై ఆదికూర్మ, సప్తకులపర్వత, ఆదిశేష, వరాహములు
మోయఁజాలని భూభారమును తన బాహుపీఠముపై నిల్పుకొని భరించుటచేత, వాని
తగులపు బాదఱను మాన్పి కీర్తి లోకములెల్ల వ్యాపింపఁగా, శత్రురాజులు ప్రక్కలకొదిగి
యణఁగి జీవింపఁగా నతిశయమైన పరాక్రమముతో నెగడెను.
దానమునకు గనియని పేరొందిన యా తిమ్మరాజునకును, నాతని దేవేరియైన
దేవకీదేవికిని, రూపవంతుఁడు, సజ్జనరక్షకుఁడునైన ఈశ్వరరాజు జన్మించెను. దుష్టులైన
త్రిపురులను రాక్షసుల సంహరించి ఆర్యను (పార్వతిని) పరిపాలించిన వెనుకటి ఈ
ఈశ్వరుఁడే ఈశ్వరరాజై పుట్టి, దుష్టులైన శత్రురాజుల పట్టణములను ధ్వంసమొనర్చి
ఆర్యులను బరిపాలించుచుండఁగా, నాలు బిడ్డలను విడిచి భయముతో కొండలను
నరణ్యములను బట్టి తిరుగాడుచున్న శత్రురాజుల దేహములందు మన్మథవికారము
లన్నియును నశించెను. ఈశ్వరరాజు సామంతరాజులచే నర్పింపఁబడిన కాన్కలచే
సంపాదించిన సంపత్తితో నింద్రుని మించిన భాగ్యశాలి. తన భుజము నాశ్రయించిన
భూమికి వజ్రకవచమైననాఁడు. దుర్మార్గులనెడి కాలసర్పములకు పాములవాఁడు.
స్త్రీలచిత్తము లనెడి సొమ్ములకు నందరు చూచుచుండఁగనే పగటివేళ దొంగిలింపఁగల
గడిదొంగ. శత్రువులనెడి హంసల సమూహమునకు వర్షాకాలము. యాచక సమూహ
మనెడి కోకిలలకు వసంత కాలపు దినమైనవాఁడు. గుణరత్నములకు
రోహణపర్వతమైనవాఁడు. చుట్టముల సమూహమనెడి పద్మవనమునకు సూర్యుఁడు.సాహిత్య విమర్శ
655