పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అందఱకును నిద్ర కలుగు కాలము సమము కాదంట! కళాశాల విద్యార్థులకిరువది యెనిమిది నిమిషములు, నడివయసున నున్నవారి కిరువదియైదు నిమిషములు కాలము కావలయు నఁట! స్త్రీలకుఁ బదునైదు నిమిషముల కాలము చాలునఁట!

నిద్రలోఁ గదలి నంత మాత్రమునఁ గలఁత నిదుర కాఁజాలదు. పసిబిడ్డ వలె నిద్ర నోవుట పరమప్రయోజనకారి. 'మొద్దువలె నిద్రించినవాఁ డెద్దు వలెఁ బనియొనర్చు' నను సామెత యున్నది.

ఏకాదశి సంపూర్ణ జాగరము వ్రతవిధానములందును శాసింపఁ బడినది. దశమి యేకభుక్తము; ద్వాదశి పూర్ణ భోజనము. 'దివానిద్ర యోగభంజక' మని 108[1]యోగకుండ ల్యుపనిషత్తు పలుకుచున్నది. పూర్వరాత్రి నిద్ర సౌందర్యసంవర్ధక మని పాశ్చాత్యులలో నొక ప్రథ యున్నది.

పూర్వము టర్కీ దేశములలోని అంకారా విశ్వవిద్యాలయ విద్యార్థిలోకము పగటి నిద్దురను గూర్చి కొన్ని పరిశోధనలు సాగించినది. వారి పరిశోధనల ఫలితాంశములు రాత్రి నిద్ర మానవునకుఁ బనికిరాదనియు, దీర్ఘ నిద్ర నిష్ప్రయోజనకరమైనదనియును, ప్రతి వ్యక్తియును బగ లొకమాఱు మూఁడు గంటలు మఱల నొకమాఱు రెండుగంటలు నిద్రించుట కలవాటు పడిన, మిగిలిన కాలమంతయు శ్రమ యనుకొనకుండఁ బనిఁ జేయవచ్చునని సిద్ధాంతీకరించినారు. వారి పరిశోధనలవలన రాత్రి పదియును రెండు గంటలు నిదురించు వారి మించి పైరీతిగ నిదురింప నలవాటు పడినవారు పని చేయవచ్చుననియు, వారలకే విశేష విశ్రాంతి చేకూరునట్లును వెల్లడియైనది. పరీక్షాఫలితములందును పగటి నిద్ర నొందువారే ప్రథమగణ్యు లైనారట. వీరి పరిశోధనలయందలి సత్యాసత్యము లెట్లున్నను వీరి మార్గము వైద్యశాస్త్రమునకు, సామాన్య ప్రకృతికి విరుద్ధమగుటచే నీ విద్యార్థులకు 'ఉలూక' ములను నామము కొంతకాలము ప్రపంచమున విశేషప్రాచుర్యము వహించినది.

“నిద్ర సుఖ మెఱుఁగదు, ఆఁకలి రుచి నెఱుఁగదు" ఈ సామెత యాంధ్రభూమి నతి ప్రసిద్ధ మైనది. అయినను సుఖనిద్రకును సుందరమగు శయ్యకును సన్నిహితమగు సంబంధమున్నది. శయ్యప్రాముఖ్యమును గుర్తించిన నెపోలియను చక్రవర్తి 'జగత్తు నందలి సమస్త సింహాసనము లిచ్చినఁ బ్రతిగ నా శయ్యను విడువలే' నని పలికినాఁడు. మానవుఁడు శయ్యయందు బెరుగుచున్నాఁడు శయ్యయందు మరణించు చున్నాఁడు. దేశకాల పాత్రముల ననుసరించి శయ్యావిభేదము లెట్లు మార్పునొందినను శయ్య తప్పదు. అర్జునుని గౌరవానురాగములఁ జూఱఁగొనిన భీష్ములవారి కుత్క్రాంతి వేళ

మణిప్రవాళము

65

  1. 108. యోగకుండల్యుపనిషత్తు - కృష్ణయజుర్వేదీయము లైన ముప్పది రెండు ఉపనిషత్తులలో నిది యొకటి