విశేషముగాఁ గన్పట్టును. ప్రకృతి నతినిశితముగ పరిశీలించినవారిలో నీ బెద్దనార్యుఁ
డొకఁడనిపించును.
ఇందలి కొన్ని వర్ణనలతో సరిపోల్చదగినవి ఆంధ్ర సాహిత్యమునందే కాక
సంస్కృత సాహిత్యమునందును, లేదా ప్రపంచ సాహిత్యమునందును లేవని చెప్పుట
యతిశయోక్తి కాదు. ఆయా కథాసన్నివేశములలో పాత్రల మనోవృత్తులను, అవస్థా
విశేషములను, జేష్టాదికములను కడు కౌశలముతో బెద్దనార్యుఁడు చిత్రింపగలఁడు.
ప్రవరునిచే దిరస్కృతయై పర్వతసానువులు వెంట దుఃఖనిర్మగ్నమై తిరుగుచు, దరి
లేని దుఃఖసాగరము నీఁదుచున్న వరూథిని అవస్థను చిత్రించిన సందర్భమున,
పెద్దనార్యుఁడు ప్రదర్శించిన విరహిణీ 'హృదయ వివృక్త పరిజ్ఞానము' మహాశ్చర్యకరము!
దృశ్యవర్ణన సంపదయందు మనుచరిత్రము మేటి. ఇందలి పూర్వభాగములోని
హిమవద్గిరిదరీఝరీ సానువర్ణనలు, సంధ్యాకాలవర్ణనలును, ఉత్తరభాగమందలి
అటవీమృగయావర్ణనలు చిత్రలేఖనమునకు ఒరవడి కాదగిన దృశ్యములు. ఇవి
కథాసందర్భమునకు ఉచితములును, కథాకార్యమునకు అవశ్యకములునైనవి. వీని
మూలముగా 'కావ్యశ్రీ నాటకమునకు పెద్దనార్యుఁడు రంగస్థల వ్యాపారమును
నిర్వహించినాఁడు.' ఆయా యెడలఁ బొడము రసభావములకు ఉద్దీపన విభావములుగా
వెలుగొందజేసినాఁడు. కథ యందలి ప్రతి నాటకీయ సన్నివేశమునకును (Dramatic
Situation) ముందు పెద్దన మనోహరవర్ణన మొనర్చి నేపథ్యచిత్రణము నొనర్చి గాని
పాత్రలచే సంభాషణమును జేయింపఁడు.
ఇందు మూలమున పాత్ర లే పరిసరములలో నెట్టి యవస్థావిశేషములందు
సంభాషించు చున్నారో పాఠకునకుఁ గన్నులముందు గోచరించుచుండును. మరియు
వర్ణిత దృశ్యముల స్వభావమునుబట్టి పదగుంఫనము గూడ నొకయెడ సరళముగా,
నొకయెడ నుదాత్తముగా, ఒకయెడ గంభీరముగా, ఒకయెడ సంక్లిష్టముగా
రూపొందుచుండును.
'శబ్దసరణి యెన్ని రూపాంతరములు పొందినను పెద్దన వాక్కునకు సహజమైన ప్రసన్నత, ముత్యములోని లావణ్యమువలె ప్రస్ఫుటమగుచునేయుండును. మఱియు వర్ణనానుగుణముగా నినదించునట్లు శబ్దమును గుంఫనము చేయుటలో ఈ కవి అద్వితీయుఁడు' (శ్రీ పింగళి). 'కావ్యములలో స్థిరపదార్థములను వర్ణించుటకంటే చరపదార్ధములను వర్ణించుట కష్టతరము. అంతకంటెను దుష్కరము ప్రాణుల అంతర పరివర్తనములను వర్ణించుట.సాహిత్య విమర్శ 643