Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/641

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మనుచరిత్ర పుట్టినది మొదలు హావభావాది విలాసములతో నెంతటిజితేంద్రియునైన జయింప సాహసించు 'శృంగార చణత'కు వరూథినిది, జితేంద్రియతకు శుకమహర్షిని మరపించు ప్రవరునిది ఆంధ్రలోకమున పెట్టిన పేరులైనవి. మార్కండేయ పురాణమం దే మూలనో యున్న ఈ పాత్రద్వయమును జూచి పునఃసృష్టించి రసికలోకమున కిచ్చిన అపూర్వశిల్పి పెద్దనార్యుఁడు తక్క నింకొకఁ డే భారతదేశ ప్రాంతీయ భాషయందును నున్నట్లు కన్పట్టదు.

సిద్ధుఁడన్న పేరు చెవిసోకినంతనే ఔషధ సిద్ధునిఁ బోలిన సిద్ధుఁడు యావదాంధ్ర సాహిత్యము నందును గోచరింపక పోవుటయును గమనింపవలసిన యంశము.

'ప్రవరసిద్ధ సంభాషణము' నందే పెద్దనార్యుఁడు ప్రవరుని పాత్ర కొక విస్పష్ట రూపచేష్టభాషాదికము నిచ్చి యొక వ్యక్తిత్వమును (Individuality) జేకూర్చుటయును గమనింపవలసి యున్నది. ఉత్తరకథ లేకున్నను ప్రవరుఁడు మరపురాని పాత్రగా నిల్వగలఁడన్న యభిప్రాయ మీ ఘట్టమును జదివినంతనే పాఠకునకు గలిగితీరును.

సంభాషణవిరచనము

ఉత్తమ కథకున కావశ్యకములైన ప్రజ్ఞలలో సంభాషణ విరచన మొకటి. కథాకథన దక్షుఁడైన కవి ఎపుడు వర్ణింపవలయునో, ఎపుడు పాత్రల కథారంగమునకుఁ గొనివచ్చి వారిచే సంభాషణ చేయింపవలయునో బాగుగ నెఱుఁగును. పెద్దన ఉత్తమ కథకుఁడు. సంభాషణ విరచనాప్రావీణ్యము ఈ మహాకవి కనంతముగ నున్నది. రసావస్థల కనుగుణముగ నీతఁడు పాత్రలచే సంభాషణము చేయించినాఁడు.

ఇతఁడు సంభాషణలు సాగించుటలో వ్యంగ్య, గుణీభూతవ్యంగ్య, వాచ్య మర్యాదల నెల్ల నెఱిఁగి, పాత్రలచే వ్యంగ్య సంభాషణలచే చలింపఁ జేయఁజాలక వాచ్యముగ తన హృదయానురాగమును దెల్పి, 'దీనాలాపములతో వేడుకొనుటే గాక, తనబుద్ధిగరిమచే ప్రవరుని సదాచార సిద్ధాంతములను 'ఆనందో బ్రహ్మ'యటన్న ప్రాఁజదువు నంతర్బుద్ధి నూహింపుమా' యన్నంతవఱకును వెళ్ళి, పూర్వపక్షము చేయఁజూచిన వరూథినియుక్తులను, సహజ వైరాగ్యసంపత్తితో నొప్పు ధర్మబుద్ధితో ఆమె తలఁపును మందలింప యత్నించిన ప్రవరుని సమాధానమును గల సంఘర్షణముతో గూడిన సన్నివేశమున పెద్దనార్యుడు నడిపిన సంభాషణములు, ఆయన బుద్ధివ్యాపారవిన్యాసములతో గూడిన రమణీయసంభాషణ విరచనా చాతుర్యమునకు పరమావధిగ గన్పట్టుచున్నది.


సాహిత్య విమర్శ

641