Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/639

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కావున మనుసంభవమునకుఁ బ్రభవ కారణమైన ప్రవరుని చరిత్రమే లేనిచో, ఈ కావ్యమునకు బీజమే ఉండదు. (శ్రీ పింగళి).

ఇంతటి దూరదృష్టితో ధార్మికాభిమాన ప్రవృత్తులతోను తన కావ్యమునకుఁ గథారంభ మొనర్చుట పెద్దనార్యుని కథాకథన ప్రావీణ్యమున కొక తార్కాణము. “

పెద్దనార్యుని కథాకథన శిల్పప్రావీణ్యము పరాకాష్ఠనందిన ఘట్టము వరూథినీ వృత్తాంతము. ఇందు ప్రధానపాత్రలు వరూధినీ ప్రవరులు. భిన్నప్రకృతులు. పరస్పర విరుద్ధములైన శృంగార శాంతములకు గ్రామముగ ప్రతీకలు. ఆలంబన విభావములు.

భిన్న లోకములలో (దేవ మానవ లోకములు) జన్మించినవారు. వరూథినిది భోగభూమి - ప్రవరునిది కర్మభూమి. ధర్మవిషయమునను నిరువురకుఁ బరస్పర వైరుద్ధ్యమున్నది. అట్టి ప్రకృతులకు, నవస్థలకు లోనైన పాత్రలకు సంబంధించిన కథను, ఉత్తమకథకుఁడై యే వంకకును మొగ్గక, కడు సమర్థతతో పెద్దనార్యుఁడు మెప్పు పుట్టి రసికజను లాహా! ఏమి కథన శిల్ప నైపుణ్య మనునట్టు నడిపినాఁడు. వరూథినీమాయాప్రవర పాత్రలతోఁ గూడిన వరూధినీవృత్తాంత మందలి ఉత్తరార్ధమునను పెద్దనార్యుని కథాకథనదక్షత అవస్థానుగుణమై మహోదాత్తముగనే యొప్పుచున్నది. మాయాప్రవర వృత్తాంతమును పెద్దనార్యుని కథనశిల్పమున మనోజ్ఞముగఁ గోచరించుచున్నదనుటలో నెట్టి సంశయమును లేదు. మనుచరిత్రలోని ఉత్తరార్థమందలి కథ రసవిషయికముగాఁగాని, కథాసన్నివేశాదులచే గాని, పాత్రల వైశిష్ట్యాదుల వలన గాని పూర్వార్థమందలి కథతో నే విధముగను సరిపోలునట్టిది కాదు. అందు కథానిర్వహణ మాత్రమునకు అక్కరకు వచ్చు అలతి యలతి వృత్తాంతములు మాత్రమే కొన్ని కలవు. ఆ వృత్తాంతములు వరూథినీపుత్రుఁడైన స్వరోచి జీవితమునకు సంబంధించినవి.

పెద్దనవంటి కృతహస్తుండైన కవిగానిచో ఈ భాగమంతయును పేలవముగా తేలిపోయి యుండెడిది. ఈ కవీంద్రుఁ డీ యెడ 'కథావస్థానుసారముగ పద్యరచనా సౌందర్యమును, కథనచాతుర్యమును ప్రదర్శించి, గ్రంథమునకు నెట్టి వెలితి రాకుండఁ గాపాడినాఁడు.

పాత్రసృష్టి

మహాకవులు శక్తిసామర్థ్యములను బ్రదర్శించు కవితాగుణవిశేషములలో నీ పాత్రసృష్టి లేదా పాత్రోన్మీలనాసామర్థ్యము ఒకటి. స్వీకరించినట్టి లేదా కల్పించినట్టి


సాహిత్య విమర్శ

639