Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/637

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రబంధమగుట చేత, తరువాతి ప్రబంధ కర్త లెల్లరును దీనిని బుద్ధిపూర్వకముగానో, అప్రతర్కితముగానో (విచారింపఁ బడకనో) అనుకరించిరి. ప్రబంధకవులలో పెద్దనార్యుని యగ్రస్థానమునకు ఇది ప్రబల దృష్టాంతము.

కవితావిశేషములు

మనుచరిత్ర - గుణ దోషములు

ఆంధ్రసాహిత్య ప్రపంచమునందలి అమూల్యాభరణములైన పంచ మహాకావ్యములలో నొకటిగఁ బరిగణింపఁబడుటయే గాక, రాయలయుగమందలి (లేదా ప్రబంధయుగమందలి) కావ్య జాలమంతటికిని మార్గదర్శకమై, ప్రబంధమనెడి నూతన ప్రక్రియావిభేదమునకు సంబంధించిన శిల్పవిన్యాసముల కెల్ల గనియై, కృతికర్తకు మహాకవికోటిలో స్థానమొసఁగిన ప్రబంధ రాజము మనుచరిత్ర. ఏతత్కృతికర్త ఆంధ్ర కవితాపితామహుఁడు అల్లసాని పెద్దనార్యుఁడు. చతుర్విధ కవితానిర్వాహకుఁడు. సాహితీసమరాంగణ చక్రవర్తియైన కృష్ణరాయల భువన విజయ విద్వదోష్ఠికి సభాపతి.

ఇట్టి అపూర్వ వ్యక్తిత్వము గల దక్షుఁడైన పెద్దనార్యుని మనుచరిత్రమున గుణవిశేషము లెన్నియో లెక్కలేనన్ని యుండకున్నచో దానికి గాని, తత్కర్తకుఁగాని అగ్రస్థానము ఎట్లు లభింపగలదు? బహువిధ గుణాధిక్యముచే నొప్పకున్నచో 'కవితాప్రావీణ్య ఫణీశుఁ డని కీర్తిగన్న రాజాధిరాజైన రాయ లీ మహాకావ్యమును గృతినందుకొనువేళ పెద్దనార్యుఁడు పురమేగునపుఁడు పల్లకిని దనకేలఁబట్టి యెత్తుట యెట్లు?

కథాకథన ప్రావీణ్యము

సామాన్యముగ నొక కావ్యమందలి గుణవిశేషములను బరిశీలించు సందర్భమున గమనింపవలసిన యంశములలో నీ కథాకథన ప్రావీణ్యమొకటి. ఆంధ్ర సాహిత్యమున కేవలము నూతనకథను కల్పించినవాఁడు పింగళి సూరనార్యుఁడొక్కడే. ఉత్పాద్య కథలకు (Original story) ఆ కాలమున గౌరవము లేదు. కావున పెద్దనాదులు ఘనమైన భావనాబలము కలవా రైనప్పటికిని నూతనకథలను సృష్టించుటకుఁ బూనుకొనలేదు. పురాణోక్తములైన ప్రఖ్యాతకథలనే వారు స్వీకరించుచు వచ్చిరి. కావున నీ యంశము విషయమున, నాయాకవులు పురాణమునుండి గ్రహించిన కథను తిరిగి


సాహిత్య విమర్శ

637