Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/636

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మనోరమను రాక్షసుఁడు తరుముకొనుచు స్వరోచికడకుఁ దెప్పింపవలసియున్నది. కావున నట్టి సమాగమ సమావేశముల కనుకూలముగా నుండుటకై కావ్యతత్త్వజ్ఞుడైన పెద్దన భయానక బీభత్సములతో గూడిన వేట జరిగినట్టి యరణ్య ప్రదేశమును రంగస్థలము గావించి దానిని వర్ణించినాఁడు. దీనినే వాతావరణసృష్టి (The creation of atmosphere) అని పాశ్చాత్య విమర్శకులందురు. 'ఇది మన శాస్త్రములలోని ఉద్దీపన విభావమున కించుమించు సరిపోవును' (శ్రీ పింగళి). మిగిలిన సందర్భములన్నింటను పెద్దన మూలమునే యనుసరించినాఁడు.

అయినను మార్కండేయ పురాణమునను పాఖ్యానముగా నున్న ఈ కథను చదువునప్పుడును, ప్రబంధమండలి యీ కథను జదువునప్పుడును కల్గు నానందములు వేరు. మనుచరిత్రయందు పురాణమందలి ఈ ఉపాఖ్యానమునఁ గన్పట్టని అపూర్వ శిల్పసృష్టి సర్వత్ర గోచరించును. ఇదియే పురాణము లందలి ఉపకథలకును, ప్రబంధములకును సహజముగా గన్పట్టు భేదము. ప్రబంధాత్మకమైన శిల్పవిన్యాసముల మూలముననే మారన మార్కండేయ పురాణమునందలి 150 పద్యముల కథ, మనుచరిత్రలో 800 పద్యములుగా బెరిగినది.

ఉత్పాద్యవస్తువునకు కాలప్రభావముచే (లక్షణము) గౌరవము లేనందున కథను పురాణమునుండి గ్రహించినప్పటికి, 'కథన చమత్కృతి, వర్ణననైపుణి, పాత్ర సృజనశక్తి, రసదీప్తి కలిగి సమగ్ర ప్రసాదిత (పూర్తిగా నలంకరింపబడినది) మైన రంగమునందు బ్రదర్శింపబడిన నాటకమువలె నీ కావ్యము సహృదయరంజకముగా నాల్గు వందల సంవత్సరములనుండి, ఆంధ్రప్రబంధలోకమున తన ప్రాభవము నకుంఠితముగా నిర్వహించుకొనుటకుఁ గారణభూతమైన సమస్తశక్తియును ఆంధ్రకవితా పితామహుఁడైన అల్లసానివానిదే. ఈ మనుచరిత్ర 'మల్లసానివారి అల్లిక జిగిబిగి' యను పలుకులు ప్రతిపదమును సార్థకపఱుచుచున్నవి.

పెద్దనార్యుఁ డీ ప్రబంధమును దీర్ఘకాలము పరిశ్రమ చేసి తన సర్వతోముఖ పాండిత్యమును జతుర్విధ కవితా విలాసమును వెలయించి, నిబ్బరమైన శైలి నాహా పుట్టించునట్లు పోహళించెను గాని యందదుకులుగా నెందును ముడిపెట్టలేదు.

ఈ గ్రంథమునందు గూర్చు నేర్పును, భావవైచిత్ర్యమును బిక్కటిల్లని పద్యముగాని, గద్యముగాని చూపట్టదు. ఎక్కడఁబట్టిన నక్కడఁ గవీశ్వరుని లోకజ్ఞానము, భాషావైదుష్యము (భాషాపాండిత్యము), కల్పనాచాతుర్యమును వెల్లివిరియుచున్నవి. (శ్రీ వేటూరి). (అనేక) గుణము లొక్కచో రాశీభూతమై యావిర్భవించిన మొదటి


636

వావిలాల సోమయాజులు సాహిత్యం-4