Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/635

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జంపఁబోవు చుండఁగా, నొక లేడి వచ్చి 'రాజా! దానిని చంపవలదు, నన్ను జంపుము' అయ

స్వరోచి మనుష్య భాషణముల నా లేడి యట్లు పల్కుట కాశ్చర్యమొంది, 'నిన్నేల జంపుమందువు?" అని ప్రశ్నింప నా లేడి ఇతర స్త్రీలతోఁ గ్రీడించువానిని గోరుటకన్నఁజచ్చుట మేలని పల్కినది. పిమ్మట నా లేడి 'నీ వెవనిని ప్రేమించితి' వని యడుగఁగా 'నిన్నే ప్రేమించితిని. నన్ను కౌఁగిలించుకొను' మని కోరినది. స్వరోచి యల్లొనర్చినంతనే యా లేడి యొక సుందర స్త్రీమూర్తియై యాతని కౌఁగిట నొదిగి, పిమ్మట తాను ఆ వనదేవతనని 'సమస్తదేవతలును నీ వలన మనువును పొందవలసినదని నన్ను గోరుటచే నిటు వచ్చితి' నని చెప్పి, తన్ను స్వీకరింపవేడినది. స్వరోచి యామెనుగూడ భార్యగా నంగీకరించెను.

స్వారోచిష మనుసంభవము

అనతికాలమున నామె గర్భిణియై 'స్వారోచిషుఁ' డను బాలుని కనెను. అతఁడుయుక్తవేళ శ్రీహరిని గూర్చి తపమాచరించి విష్ణువు ప్రత్యక్షము కాఁగా 'దేవా! నేనీ ప్రపంచమున నుండఁజాలను. నన్ను నీలోఁ గలుపుకొను' మని ప్రార్థించెను. శ్రీహరి 'నీ కోర్కెను దీర్చెదను. కాని నీవు కొంతకాలము భూలోకముననుండి ధర్మరక్షయొనర్పవలసియున్నది. నీవు, రెండవ మనువై భూమిని పాలింపు' మని పల్కి అదృశ్యుఁడయ్యెను. శ్రీహరి యాజ్ఞానుసారముగా స్వారోచిషుఁడు కొంతకాలము ప్రజాపాలనమొనర్చి పిమ్మట మహావిష్ణువులో నైక్యమొందెను.

మూలానుసరణము

మారన మార్కండేయ పురాణానువాదమున పురాణమునందలి మూలకథ నెట్లనుసరించినాఁడో యదేరీతిగా పెద్దనార్యుఁడును ప్రధానముగా అనుసరించినాఁడు. మూలమందలి కథకును, ప్రబంధమందలి కథకును స్వల్ప భేదములు రెండు మూఁడు కన్పట్టుచున్నవి. అవియైనను విస్తారమైన వ్యత్యాసములు కావు. స్వల్పములైన ఈ వ్యత్యాసముల వలన 'మనుచరిత్ర'కు గుణాధిక్యము కల్గినదే గాని యెట్టి లోపమును గల్గలేదు.

మనుచరిత్రమునకు మూలమునకు భిన్నమైన ప్రధాన కల్పనము స్వరోచి మృగయావర్ణనము. ఈ వేట వర్ణనమును పెద్దనార్యుఁడు ఆ కథాసందర్భమున జరుగనున్న సన్నివేశములకు రంగముగాఁ జిత్రించినాఁడు. భయవిభ్రాంతయైన


సాహిత్య విమర్శ

635