యున్న యాశ్రమభూమికిఁబోయి విహరించుచు బాల్యచాపల్యమున నతని సమాధికి భంగము గావించుటయు, నతఁడు వృద్ధుఁడనైన నన్ను అవమానించితివి గావున నీవు రాక్షసుని వలన బాధ నొందెదవని శపించుటయును దెలియఁజెప్పెను.
ఆ సమయమున తన చెలికత్తెలు శాపమిచ్చినందులకు మహర్షిని నిందింపఁగా, నతఁడు కోపించి వారిని క్షయ రోగపీడితలగుదురని శపించుటయును మనోరమ స్వరోచికెఱిగించెను.
మనోరమ తనకడ నస్త్రహృదయమను విద్య యున్నదనియును, దాని నతని కొసఁగెదనని చెప్పి 'దాని సహాయమున నీవు రాక్షసుని సంహరింపు' మని స్వరోచిని కోరెను. అంతట స్వరోచి శుచియై మనోరమవలన అస్త్రహృదయమును ఉపదేశము పొంది, అప్పటికి తనపై వచ్చి పడిన రాక్షసునితోఁ బోరాడెను. అతఁ డెంతటికిని లొంగకపోవుటచే స్వరోచి ఆగ్నేయాస్త్రమును బ్రయోగింపగా నా రాక్షసుఁడు నేలగూలెను. అతని శరీరమునుండి యొక దివ్యతేజము గంధర్వరూపమున వచ్చి స్వరోచిని చేరెను. ఈ గంధర్వుడే మనోరమ తండ్రియైన ఇందీవరాక్షుఁడు. అతఁడు తాను పూర్వ మాయుర్వేదమును నేర్చుకొనఁ గోరి యొక మునికడకుఁబోగా నతఁడు తిరస్కరింపఁగా, ప్రచ్ఛన్నుఁడై యాతనికడనే విద్య నేర్చి, యా విషయము నాతని కెఱిగింపఁగా నతఁడు కోపము వహించి రాక్షసుఁడవు గమ్మని శపించుటయును, శరణుఁ జొరఁగా గొన్ని దినములకు నీవు రాక్షసరూపమున నీ కుమార్తెనే మ్రింగబోయి, యొక మహాత్ముని బాణములకు గుఱియై శాపాంతము నొందెదవని చెప్పుటయును స్వరోచికిఁ జెప్పెను.
తుదకు ఇందీరాక్షుడు తన కుమార్తెయైన మనోరమను ఆయుర్వేదవిద్యతోఁబాటు స్వరోచికి కాన్కగా నర్పింప, నతఁడు ఆమెను సంతోషముతో గ్రహించెను. తరువాత నిందీవరాక్షుఁడు స్వరోచిని తన నగరమునకుఁ గొనిపోయి వైభవముగ వివాహ మొనర్చినాఁడు. అనతికాలమున మనోరమ కోర్కెపై స్వరోచి ఆమె చెలికత్తెల కుష్ఠువ్యాధినిఁగూడ నయమొనర్చి వారికి బూర్వ సౌందర్యమును జేకూర్చినాఁడు. వారతని వివాహమాడఁ బ్రార్థింపగా, స్వరోచి మనోరమ యంగీకారముతో వారినిఁగూడ వివాహమాడినాఁడు.
వనదేవతావృత్తాంతము
మువ్వురు భార్యలతో స్వరోచి బహుకాలము సుఖించిన పిమ్మట, నొకనాఁడు వేటకేగి యనేక జంతువుల సంహరించియు దృప్తినొందక యొక వరాహమును
634
వావిలాల సోమయాజులు సాహిత్యం-4