Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/633

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సమయమున స్త్రీ పురుషులొండొరులను జూచుకొనరాదు. కన్నులు మూసి కొనవలయును. మా దేశాచారమైన దీనికి విరుద్దముగ నేను బ్రవర్తింపజాలను. ఇందులకు నీకిష్టమేని చెప్పు' మనినాఁడు. 'నీ కొఱకు నేను పదభ్రష్టుఁడనగుచున్నాను. నీతో చిరకాలము సుఖింపనైన సుఖింపవలయును. లేకున్న తపమైన నాచరింప వలయును. ఉభయ భ్రష్టుఁడను కాఁజాలను' గదా యనినాఁడు.

ఇట్టి యనుకూలప్రసంగమున కెంతో సంతోషించి వరూధిని నీ ఇష్టానుసారముగా ప్రవర్తింతునని చెప్పెను. అంతట నొక మణిగృహములోనికేగి వారు క్రీడించిరి.

స్వరోచి పుట్టుక

మాయాప్రవరునివలన వరూధిని గర్భమును ధరించెను. అచ్చట తానుండవలసిన పని తీరిపోయినదని తలపోసి, చెప్పక వెళ్ళినచో స్త్రీహత్యాపాతకము చుట్టుకొనునని తన గృహ పరిస్థితులు బాగుగా లేవని సిద్ధునివలన దెలిసికొన్నట్లు బలికి, సెలవు గొని వెళ్ళిపోయినాఁడు. అతఁడు సెలవు గైకొనునపుడు వరూధిని కన్నీరు గార్చఁగా నతండు 'దివ్యవనితవు. ధీరురాలవు. నీవిట్లు బేలవగుట తగ' దాని యోదార్చి సమయోచితముగఁ బ్రసంగించి, తన దారిని పరమానందముతో వెళ్ళినాఁడు. నవమాసములు నిండిన పిమ్మట వరూథిని యొక శుభముహూర్తమున కుమారునిఁగనెను. మహర్షు లా బాలుఁడు సూర్యచంద్రులవలె బ్రకాశించుటను గుర్తించి 'స్వరోచి' యని పేరిడిరి. యుక్తవయసు వచ్చిన పిమ్మట నా స్వరోచి మునులకడ సకల విద్యలనభ్యసించి మహావీరుఁడై, విశ్వకర్మ మందరగిరి మీఁద నిర్మించిన నగరము రాజధానిగా నాటవికులు గొల్వ రాజ్యపాలన మొనర్చుచుండెను.

స్వరోచి వేట - మనోరమావృత్తాంతము

ఒకనాడు తన పరివారముతో స్వరోచి వేటకేఁగి తనివితీరగా దుష్టమృగ సంహారమొనర్చిన పిమ్మట, గొన్ని యపశకునములు తోఁచెను. అంతట స్వరోచి యశ్వము నధిరోహింపఁగా గొన్ని శుభశకునములు గన్పట్టెను. ఇంతలో 'ఆర్తను, అనాథను రక్షింపుఁ' డను కేక వినిపించినది. ఆ ధ్వని వచ్చిన వంకకుఁ బోవుటకు స్వరోచి యత్నించుచుండఁగా, నొక యౌవని యటకు వచ్చి 'మూఁడు దినములనుండి నన్నొక రాక్షసుఁడు వెంటబడి తరుముచున్నాఁడు. నేను ఇందీవరాక్షుఁడను గంధర్వరాజునకు మరుదశ్వుని కుమార్తెవలన గల్గినదానను. నా పేరు మనోరమ' అని చెప్పి, పూర్వము ఆమె తన చెలికత్తెలయిన కళావతి విభావసులతో నొక వృద్ధముని


సాహిత్య విమర్శ

633