Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/632

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రవరుఁడు వైదికుఁడు గావున అది యంతయు బ్రాహ్మణభక్తియని తొలుత తలపోసి క్రమముగఁ దెలిసికొని 'ప్రతినై కర్మకాండమున దినములు గడపు నన్నేలకామించితి?' వని పల్కి, తనయెదుట నట్టిమాట లాడవలదనినాఁడు.

వరూథిని తొలుత నాతని మాటలకు నిరాశ జెంది పిమ్మట ధైర్యము తెచ్చుకొని, 'మీ యజ్ఞముల కన్నింటికిని ఫలము మా కవుగిళ్ళలో సుఖించుటయే గదా! వ్రతములకై ప్రాకులాడెదవేల? - స్వర్గ ఫలమే నీ యెదుట సాక్షాత్కరించినది. కావున నన్నుఁ గూడి సుఖింపు' మని కోరినది. 'ఆనందో బ్రహ్మ' యన్న ప్రాఁజదువు నూహింపుమనికోరినది.

కాని ప్రయోజనము లేకపోయినది. ప్రవరుఁడు “చెప్పకుమిట్టి తుచ్ఛసుఖముల్ మీసాలపై తేనియల్" అని పలుకగా, నామె 'నన్నిఁక బాధపెట్ట వల' దని దీనయై మీదఁ వ్రాలి కౌగిలించి అధరము నాసింపఁగా నతఁడు ప్రయత్నమును సాగనీయలేదు. పొమ్మని త్రోసిపుచ్చినాఁడు. అపుడధిక దుఃఖముతో చుఱచుఱ జూచుచు దయారహితుఁడవని నిందించి కలస్వనముతో నేడ్చినది. ఇంకను నామె యేమేమో ప్రసంగించుచుండగాఁ ప్రవరుఁడు వినిపించుకొనక, ఆ కౌగిలించినపుడంటిన జవ్వాదిని కడిగికొని గార్హపత్యమనెడి యగ్నిని ప్రార్థించి యింటికిఁ జేరుకొనినాఁడు.

వరూఢినీమాయాప్రవర వృత్తాంతము

ప్రవరుని కాఠిన్యమునకు బాధపడుచున్న వరూథినిని ఆమె చెలికత్తెలు వచ్చి ఊరడింప యత్నించిరి. కాని ప్రయోజనము లేకపోయినది. అట్టి స్థితిలో వారామెను పూఁదోఁటకుఁ గొనిపోయిరి. వరూథినిని యంతకుఁ బూర్వమొక గంధర్వుఁడు ప్రేమించి తిరస్కృతుఁడైనాఁడు. అయినను నాశవిడువక 'జవరాండ్ర చిత్తములు చంచలములు గదా! నేఁడు తిరస్కరించిన యీ వనిత యోపిక పట్టినచో రేపు నన్ను చేపట్టదా? యని భావించి యా ప్రాంతముననే యుండెను. అదృష్టవశమున ప్రవరుని జూచి వరూథిని మోహించుటయు, నతఁడు తిరస్కరించి వెడలిపోవుటయు నతని కంటఁబడినది. అతఁడు కామరూపి గావున తన యదృష్టము పండెనని తలపోసి ప్రవరుని వేషమును ధరించి, దేవతార్చనకై పూలను గోయుచున్నట్లు నటించుచుండెను. అట్టివానిని వరూథిని చూచి నిజమైన ప్రవరుఁడేయనుకొని యతనికడకేగి తన్నుఁ బరిగ్రహింపుమని దీనముగ వేడినది.

తుదకు మాయాప్రవరుఁడు జాలిని నటించి 'నీ వనుభవించుచున్న పరితాపమును జూడఁజాలకున్నాను. వ్రతముకంటె పరోపకారము ఘనమైనది గదా! సంభోగ


వావిలాల సోమయాజులు సాహిత్యం-4

632