తల్లిదండ్రులింటి పెత్తనమును దీర్చుచుండగా, నతఁడు శిష్యులకు విద్య నేర్పుచు స్వధర్మ నిరతుఁడై యొప్పుచుండు. నాతని కతిథిపూజనమన్న నమితానందము.
ఓకానాఁడొక యౌషధ సిద్ధుఁడు నగరమునకు వచ్చినాఁడని విని భక్తితో నేగిఁయింటికిఁ గొనివచ్చి సపర్యలొనర్చి, దీనముగా నతనికి ప్రవరుఁడు తన తీర్థ సందర్శనాభిలాషను వెల్లడించెను. తన శీలముచే సిద్ధుని ప్రసన్నుని గావించుకొనఁగా, యోగ్యుఁడైన ప్రవరుని యభిలాషను దీర్చుటకై తన ప్రేఁపసజ్జయందలి పసరు తీసియిది యదియని చెప్పక, సిద్ధుఁడు, ప్రవరుని పాదములకుఁ బూసెను.
ప్రవరుని హిమవన్నగయాత్ర
వెంటనే ప్రవరుఁడు హిమవంతమును జూడఁ గోరఁగా నుత్తర క్షణమునందే యతఁడు ఆ మంచుకొండపై నిలిచెను. హిమగిరిపై నాతఁడు కొన్ని రమ్య ప్రదేశములను, దివ్యస్థలములను జూచి వాని మాహాత్మ్యముల నెన్ని పగలు రెండు జాములు కాఁగా, తన కర్మకలాపమునకు వేళ దాటిపోవుచుండుటచే 'మరల రేపు వచ్చి చూచెద’నని తలచిఁ యెగురబోఁగా, పాదమునకుఁ బూయఁబడిన పూఁత కరిగిపోవుటచే నతఁడెగురఁ జాలకపోయెను.
అపుడు 'నిర్గుండె' పడి కొంతసేపటికి ధైర్యము తెచ్చుకొని ముందుకుఁ బోవుచుండఁగా నట నొక మున్యాశ్రమమును బోలి యొక యాశ్రమము కన్పించినది. ఆశతో నేను రక్షితుఁడ నగుదునని తలపోయుచు మఱికొంత దూరము సాగిపోయిన ప్రవరునకు, మ్రోడులు చివురించినట్లు వీణ వాయించుచున్న యొక గంధర్వ గాయనీమణి కాన్పించెను.
ప్రవర వరూథినీ వృత్తాంతము
అంతట ప్రవరుఁడు అనుమానింపక నామెకడకేగి తన కులమును, నామమును జెప్పి త్రోవతప్పిన తనకు మార్గమును దెల్పుమని కోరినాఁడు. ఆమె యితనివలచియుండుటచే నతని యమాయకపు మాటలకు చిఱునవ్వు నవ్వి "చేరెడు కన్నులుగల నీవు తెరు వింకొకరి నడుగ నేల? వచ్చినత్రోవ తెలియదా? ఒంటిగనున్న జవరాండ్రను పల్కరించుట కీ పని సాకుగాఁ బెట్టుకొనినా' వని పల్కి తన పేరు వరూధిని యనియును, తిలోత్తమారంభాదులు తనకుఁ జెలికత్తెలని జెప్పి, తన ప్రేమభావమును గ్రమముగ వెల్లడించెను.
సాహిత్య విమర్శ
631