పనిగ నిద్రించునఁట! ఆమెను బరిశీలింప బంధువులు ముసాచ్యుసెట్సులోని ఓల్డెన్ వైద్య శాస్త్రజ్ఞున కొప్పజెప్పిరి. అతఁడు బహువిధ పరిశోధనలు జరిపి 'యిదమిత్థ మని నిర్ణయింప లేకున్నాను. నా మతి చెడుచున్న' దని నివేదించినాఁడు. అమెరికా దేశమునందలి యొక సుప్రసిద్ధ రచయిత నిద్రాసమయముననే నిజరచనల 'టైపు’ జేసెడివాఁడు. జాగ్రదవస్థనొందిన పిమ్మట నవి తన రచనలేనా యను ననుమానమతనికిఁ గలుగుచుండెడి దఁట! 'ఇట్టి దీర్ఘ నిద్రావస్థలందుఁ దాను బూర్వము భావించిన రూపకము లందలి పాత్రలు కన్పించి సంభాషణమును సాగింపఁ దన రచనలు సాగుచున్నవని చెప్పు కవి యున్నాఁడని' స్వాన్సు విశ్వవిద్యాలయ తత్త్వశాస్త్రో పాధ్యాయుఁడు 'హీత్' ఒక విశిష్టోపన్యాసమునఁ బేర్కొనినాఁడు. నిదురించుచుఁ గొన్ని గృహకృత్యములొనర్చుట ప్రపంచమునందన్ని దేశములందును సర్వసామాన్యమైన నిద్రావైచిత్య్రము!
నిద్రాసమయ పరిమితిని గూర్చి లోకమున భిన్నాభిప్రాయములున్నవి. నెపోలియను చక్రవర్తి 'పురుషుల కారు గంటలు, స్త్రీల కేడుగంటలు, బుద్ధిహీనుల కెనిమిదిగంటలు నిద్ర చాలు' నని పల్కినటులఁ దెలియుచున్నది. కాని యా చక్రవర్తి 105[1]వాటర్లూ యుద్ధానంతరము హెలీనాద్వీపమున దినమునకుఁ తొమ్మిది గంటలు దీర్ఘనిద్ర ననుభవించినట్లు జీవిత చరిత్ర చెప్పుచున్నది.106[2]బిస్మార్కు, హంబోల్టు, చర్చిలు వంటి ప్రసిద్ధ రాజకీయ వేత్తలు నాల్గుగంటల కంటే నిద్రవోనివారు కన్పించుచున్నారు. 'నలుబది యెనిమిది గంటలు తీక్ష్ణమైన కృషి యొనర్చిన పిమ్మట నెనిమిది గంటల నిద్ర చాలు' నని శాస్త్రజ్ఞుఁడు ఎడిసన్ మహాశయుఁ డభిప్రాయపడినాఁడు.
'ప్రాణికోటికి నిద్ర యత్యవసరము కా' దని నిరూపింపఁగల ననెడు స్థిరనిశ్చయముతో హార్వర్డు పరిశోధనాలయమునఁ బ్రవేశించిన యొక యువకుఁడు రెండు వందల ముప్పది యొక్క గంటలు మేల్కొనిన తరువాత నిఁక దానిని గొనసాగింప లేక బాధపడి యట్టె విరమించినాడు. మిగిలిన జీవితమున నతఁ డున్మత్తుఁడైనాఁడు.
నిద్రాకాలనిర్ణయము దేశకాలవయోనుకూలము లని నిశ్చయింప వచ్చును. పసిపిల్లలకుఁ బదియు నారు గంటలు నిద్ర యత్యవసరము. మహాకవి కాళిదాసు 'పద్మినీజాతి స్త్రీ జాము కాలము కంటే మించి నిద్రింప' దని పలికియున్నాఁడు. అల్పకాలనిద్ర నారోగ్య శాస్త్రవేత్త లంగీకరింపరు. నిద్రాసమయము నెనిమిది గంటలనుండి యారుగంటలకుఁ దగ్గించుకొనుటచే 'కలొరిక్' శక్తిని బాతికపాళ్ళు
విస్తారముగ నుపయోగింపవలసి యుండునని వారి నిర్ణయము. నిద్ర నీ రీతిఁ- ↑ 105. వాటర్లూ యుద్ధము - (వాటర్లూ బ్రూసెల్సుకు 11 మైళ్ళదూరమున నున్న నగరము) బ్రిటిష్వారికి ఫ్రెంచివారికి 18 జూన్ 1815న యుద్ధము ప్రారంభమైనది. తుదకు నెపోలియన్ లొంగిపోవుటతో 15 జులై 1815లో నంత మొందినది. నెపోలియన్ హెలీనాద్వీపమున ఖైదీయైనాఁడు. నెపోలియన్ - (క్రీ.శ. 1769 - 1821) ఫ్రెంచి చక్రవర్తి. సామాన్య సేనాధికారి పదవినుండి చక్రవర్తియైనాఁడు. The greatest adventurer in the world.
- ↑ 106. బిస్మార్కు - క్రీ.శ. 1879లో నైరోపాయందు మహత్తర వ్యక్తి. బెర్లిన్ కాంగ్రెస్ అధ్యక్షుడు 'Man of Blood and Iron' రెమిని జెన్సెస్ - ఇతని యుత్తమరచన. హంబోర్డు (క్రీ.శ. 1769-1855) యువకుఁడుగ దేశయాత్రలు చేసి తుదకు ఖనన శాస్త్రప్రవీణుఁడై బహుదేశముల నా శాస్త్రమునకు వృద్ధి కల్పించినవాఁడు. తన యాత్రల చరిత్ర ముప్పది యుద్ధంథములుగ రచించినాడు. చర్చిలు (క్రీ.శ. 30 నవంబరు 1874) క్రీ.శ. 1900లో బ్రిటిష్ పార్లమెంటున బ్రవేశించి నేఁటివరకు నవిచ్ఛిన్నముగ సభ్యుఁడైన యాంగ్ల రాజకీయవేత్త, నేఁటి యాంగ్లేయ ప్రధానమంత్రి
____________________________________________________________________________________________________
మణిప్రవాళము
63