Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/627

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రాంతము), కొఱవి సత్తెనారన (క్రీ.శ. 1400 ప్రాంతము) అను నిరువురు కవులువహించినట్లు తెలియుచున్నది.

ఈ ఇరువురును ఆంధ్ర కవితా పితామహులైనట్లు వారి వంశీయులైన తుళ్ళూరి శరభరాజు, కొఱవి గోపరాజుల రచనల వలనఁ దెలియుచున్నది. వీరి రచనలు కన్పట్టకపోవుటచే నే కారణమున వీరి కా బిరుదము లభించినదో తెల్పుట కష్టము. వ్యాసరచిత మహాభారత ప్రపంచమును స్వకీయము గావించుకొని అపూర్వ శక్త్యుత్సాహములతో 'తన కావించిన సృష్టి తక్కొరుని చేతఁ గాదనునట్లు' రచించిన తిక్కనకు గవి బ్రహ్మ నామము లోక రూఢమైయుండఁగా, పెద్దనార్యునకు 'కవితాపితామహ బిరుదము వచ్చుటకుఁ గారణము 'ప్రబంధ సాహిత్య ప్రపంచమును' సృష్టించుటయే యైయుండునని చెప్పవలయును. ఈ బిరుదు అల్లసానివారికి మనుచరిత్ర రచనలవలనఁ కలిగినదని కొందఱు; ఈ బిరుదమును మనుచరిత్ర పీఠికాభాగముననే కన్పట్టుటచే నేతత్య్రంథ రచనకు బూర్వమే కలిగినదని కొందఱు అభిప్రాయపడుచున్నారు. ఏమైనను నీ బిరుదము మనుచరిత్ర రచనాకాలమునకుఁ బూర్వమే కలదనుట సమంజసము. ఇది పెద్దన్న కోకట గ్రామ దాన శాసనముల రెండింటను (బహుధాన్య వైశాఖ శు. 30, 25-4-1518, బహుధాన్య కార్తిక బ. 12, 31-10-1518) కన్పట్టక ప్రమాది కార్తిక శు. 30, 6-11-1519 నాటి అన్నూరు శాసనమున 'ఆంధ్ర కవితా పితామహులైన పెద్దిరాజుగారు' అని కన్పట్టుటచే క్రీ.శ. 1518-19 సంవత్సరముల మధ్యకాలమున నేదోయొక కవితాగోష్ఠియందు లభించి యుండవచ్చును. అటుపిమ్మట స్వల్పకాలమునకే పెద్దన 'మనుచరిత్ర'ను రచించి రాయల కంకితమిచ్చియుండవచ్చు.

పెద్దన జీవితకాలము

అల్లసాని పెద్దన తన మనుచరిత్ర మహా కావ్యమును క్రీ.శ. 1509 మొదలు 1530 వఱకును విజయనగర రత్న సింహాసనమెక్కి పాలించిన శ్రీకృష్ణరాయల కంకితమిచ్చినాఁడు. రాయలు అకాలమృత్యువు వాతఁబడి స్వర్గస్థుఁడు కాంగా క్రింది సుప్రసిద్దమైన చాటువును జెప్పినట్లు తెలియుచున్నది.

సీ. “ఎదురైనచోఁ దన మదకరీంద్రము నిల్పి కేలూఁతయొసఁగి యెక్కించుకొనియె, కోకట గ్రామాద్యనేకాగ్రహారంబు లడిగిన సీమలయందు నిచ్చె,


627

సాహిత్య విమర్శ