Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/626

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యుండవలయును గదా! శిరీషకుసుమ పేశల సుధామయోక్తులతోఁ గూడిన అట్టి రచనలు ఆంధ్రుల దురదృష్టమున నశించినవని యూహించుటలోఁ దప్పు లేదు.

పెద్దనార్యుఁడు కృష్ణరాయలు తన 'భువనవిజయ' సభలో జరిపించెడి విద్వదోష్ఠుల కన్నింటికిని సభాపతియై వర్తించి యుండెడివాడని ఊహించుటలో నెట్టి విప్రతిపత్తియును లేదు. 'ఫణిన సూను కణాద బాదరాయణ సూత్రఫక్కి నుపన్యసింపఁగల విద్వాంసులు', కృష్ణరాయల సంగీత విద్యాగురువు పండిత బండారు లక్ష్మీనారాయణాది (సంగీత సూర్యోదయకర్త) కళావేత్తలు, వ్యాసరాయ, శఠగోప, తాతాచార్యాది మతపండితులు, అష్టదిగ్గజకవులు మొదలైన ప్రముఖ విద్వాంసులుండెడి సభకు సభాధిపత్యమన్న సామాన్య విషయము కాదు. ఇది పెద్దనార్యుని పాండిత్య విశేషమునకు, కవితాప్రావీణ్యమునకుఁ బ్రబలతర సాక్ష్యము.

పెద్దనార్యుఁడు చతుర్విధ కవితానిర్వాహకుఁడు. చిత్రకవిత, బంధకవిత, గర్భకవిత, ఆశుకవితలు చతుర్విధకవితలు. చమత్కార ప్రధానమైన యీ రచన పెద్దనార్యునకుఁ బూర్వమున నుండిన ఐదువందల సంవత్సరముల కాలమునందును సాహిత్యమున స్వల్ప స్వల్పముగఁ గనఁబడుచువచ్చినది. చమత్కార ప్రధానమగు నియ్యది రాజసముతో గూడిన రాజసభలయందలి కవితావిద్వదోష్ఠులకు ప్రాభవమబ్బిన రాయల కాలమున బాగుగా వేరూని తరువాతి కవులకు మార్గదర్శకమైనది. 'శిరీష పేశల సుధామయోక్తులతో, కథాకథన దక్షతతో, అనన్యమైన పాత్రపోషణ సామర్థ్యముతో రసవత్కవితఁ జెప్పఁగల పెద్దనార్యుఁడు సైతము కాలప్రభావమునకు లోనై నీ చతుర్విధ కవితలఁ జెప్పఁగల్గుట యొక ఘనతఁగ జెప్పుకొనుటఁ జూడ రాయల కాలమున నిట్టి కవితలకెంతటి గౌరవము లభించినదో తెలియుచున్నది.

పెద్దన 'ఆంధ్ర కవితా పితామహ' బిరుదాకింతుడు. ఇట్టి బిరుదమీతని కున్నట్లు, 'ఎదురైనచోఁ దన మదకరీంద్రము డిగ్గి' ఇత్యాది చాటువునందలి 'ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దన కవీంద్ర యని నన్నుఁ పిలుచునట్టి' అన్న ఎత్తుగీతిలోని భాగమువలనను, మనుచరిత్రలోని పీరికయందలి 'హితుఁడవు, చతురవచోనిధి' ఇత్యాది పద్యమువలనను స్పష్టముగఁ దెలియుచున్నది. భారతమున పదునైదు పర్వముల నసామాన్య కవితాశిల్పమును ప్రదర్శించి మహాకవి తిక్కన 'కవిబ్రహ్మ' యన్న ప్రశస్తిని పూర్వమందుకొనియున్నాడు. అట్టి స్థితిలో పెద్దన్న కీ 'ఆంధ్ర కవితా పితామహ' యెట్లు కల్గినది? దీనికర్థమేమి? తిక్కన్నకుఁ దరువాతి కాలమునను 'కవిబ్రహ్మ' యనునర్థమునిచ్చునట్టి కవితాపితామహ బిరుదమును శివదేవయ్య (క్రీ.శ. 1260


626

వావిలాల సోమయాజులు సాహిత్యం-4