Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/625

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవులు, కొందఱు తమిళ సంస్కృతకవులు నుండిరి. రాయలును మహాకవి కోటిలోజేరినవాఁడు.

విద్వత్కవి ఐనను కృష్ణరాయలు పెద్దనార్యునిపైఁ బ్రదర్శించినంతటి భక్తి గౌరవములితరు లెవ్వరియెడఁ బ్రదర్శించినట్లు కన్పట్టదు. 'కవి గండపెండేరము'ను స్వయముగ సభలో కాలికిఁ దొడుగుటయును, మనుచరిత్రము నందుకొనువేళ పురమే గునపుడు పల్లకిని కేల బట్టి యెత్తుటయు రాయలు పెద్దనార్యునకొనర్చిన యపూర్వ గౌరవములు. ఇట్టి విశిష్ట గౌరవములను ప్రభువుల వలన, నందును సాహిత్యచక్రవర్తుల వలన, గొన్న కవిచంద్రుఁడు పెద్దన దక్క యన్యుఁడొక్కఁడు ప్రపంచ సాహిత్య చరిత్రయందే కన్పట్టఁడు.

పెద్దనార్యుఁడు చతుర్విధ కవితానిర్వహణమునందే కాక రాజ్య వ్యవహారములందును దక్షునివలెఁ గన్పట్టుచున్నాడు. ఇతఁడు రాయలవెంట యుద్ధభూములకేఁగినట్లు కొన్ని చాటు పద్యములవలనఁ దెలియుచున్నది.

పెద్దనార్యుని రాజ్య వ్యవహారదక్షతను గమనించుట చేతనే రాయ లీతనిని దక్షిణ ఆర్కాటు జిల్లాలోని కఠివాచిసీమ నాయంకరమునకు అధిపతిని గావించినాఁడు.

పెద్దనార్యుని కృతులు : ఆంధ్రకవితాపితామహ బిరుదము

లక్షణ గ్రంథములలోని ఉదాహరణములనుబట్టి పెద్దనార్యుఁడు 'హరికథాసార’మను మఱియొక ప్రబంధమును జెప్పినట్లు తెలియుచున్నది. ఇప్పుడది లభించుటలేదు. ఇందలి కొన్ని పద్యములు మాత్రమే నేఁడు మనకు లక్షణగ్రంథములలో దొఱుకుచున్నవి. నేఁడు మనకు లభ్యమగుచున్న పెద్దన గ్రంథము 'స్వారోచిషమను సంభవ' (మనుచరిత్ర) మొక్కటియే. ఈ రెండు కావ్యములనే గాక పెద్దన మఱికొన్ని గ్రంథములను గూడ చెప్పియుండవలయును. మనుచరిత్రను రచింపుమని కోరునప్పుడే రాయలు పెద్దన్నతో

క.
"హితుఁడవు చతురవచోనిధి
వతుల పురాణాగ మేతిహాస కథార్థ
స్మృతియుతుఁడ వాంధ్రకవితా
పితామహుఁడ నెవ్వరీఁడు పేర్కొన నీకున్?"

అని యనినాఁడు. మనుచరిత్ర రచనకుఁ బూర్వమే ఇట్టి 'ఆంధ్ర కవితా పితామహ’ బిరుదము' లభింపవలయునన్న పెద్దనార్యుఁడు ఉత్తమ కావ్యములఁ గొన్నింటిని జెప్పి


సాహిత్య విమర్శ

625