మనుచరిత్రము - అల్లసాని పెద్దన
కవి కాలాదికము
మనుచరిత్ర ఆంధ్ర పంచకావ్యములలో నొకటిగను, కొందఱిచే నగ్రగణ్యముగను బరిగణింపబడుచున్న మహాకావ్యము. ప్రబంధకవిత యనెడి నూతనకవితోద్యమమునకు మార్గదర్శకమైన కావ్యరాజము. 'నాఁటికిని నేఁటికిని ప్రబంధశైలికిని, వర్ణనౌచిత్యమునకును, కథాకథనమునకును ప్రథమోదాహరణమై తెలుఁగు ప్రబంధ శాఖలోనే గాక నాంధ్ర పంచ కావ్యములలో గూడ అగ్రస్థానము దక్కఁగొన్న, మహారచనయను విమర్శక ప్రశస్తిని సంపాదించిన కావ్యశ్రేష్ఠ మీ మనుచరిత్ర. ఈ మహాప్రబంధమునకుఁ గృతికర్త ఆంధ్రకవితాపితామహుడు అల్లసాని పెద్దనార్యుఁడు.
అల్లసాని పెద్దన
'సాహితీ సమరాంగణ చక్రవర్తి' యని 'ఆంధ్రభోజుఁ'డని విఖ్యాతిఁగన్న విజయనగర సామ్రాజ్యాధీశ్వరుఁడైన శ్రీకృష్ణరాయ యాస్థాన కవీశ్వరులలో నెల్లనగ్రగణ్యుఁడీ అల్లసాని పెద్దనార్యుఁడు. అశ్వలాయన సూత్రుఁడు. ఋక్ శాఖాధ్యాయి, వసిష్ఠగోత్రుఁడు, నందవరీక బ్రాహ్మణుఁడు. చొక్కనామాత్యుని పుత్రుఁడు. బళ్ళారి ప్రాంతమందలి దోపాడు పరగణాలోని దోరాల యీతని నివాస స్థానము. ఇతఁడు తొలుత స్మార్తుడనియును, పిమ్మట వైష్ణవమును స్వీకరించి శఠకోపయతికి శిష్యుడైనాఁడనియును దెలియవచ్చుచున్నది.
ఇందుకుఁ గృష్ణ దేవరాయలకు వైష్ణవముపై నించుక విశేషాభిమానముండుటయునొక కారణమైయుండి యుండవచ్చును. ' వైష్ణవమును స్వీకరించినపిమ్మట నీ మహాకవి తన కవితాప్రావీణ్యమునకు మెచ్చి, రాయలు తనకిచ్చిన కోకటమను గ్రామమును వైష్ణవుల కగ్రహారముగా నిచ్చి, దానికి 'శఠకోపపుర' మను నామకరణమొనర్చెను.
కృష్ణరాయలు యాస్థానమున 'కర్ణాటక కవి సార్వభౌమ', 'కుమార వ్యాస' బిరుదాంకితుఁడైన తిమ్మన వంటి కన్నడకవులు, ముక్కుతిమ్మనార్యాదులైన యాంధ్ర
624
వావిలాల సోమయాజులు సాహిత్యం-4