ప్రదర్శనాలయమునఁ బ్రదర్శింప నయిదు సంవత్సరములు గడచిన పిమ్మట నందలి
నత్త మేల్కొని నడువసాగి యధికారులు నాశ్చర్యచకితుల నొనర్చిన ట్లా మ్యూజియము
చరిత్ర వలనఁ దెలియుచున్నది.
ఈ రీతిగఁ గ్రిమికీటకములు జంతువులు నిద్రవోవుటకుఁ గారణ మాయా కాలముల వాని కాహారములైయుండు క్రిమికీటకములు నిద్రించుటయే. శీతకాలపు బాధను దొలగించుకొనుటకుఁ దనసంతానమగు వీనికిఁ దల్లియగు ప్రకృతి దీర్ఘనిద్రను బ్రసాదించినది. ఆకాశ వీథుల నెగసి యుష్ణమును బడయఁగల పక్షులు, తేనియను సేకరించుకొని రెక్కలాడించుచుఁ బట్టునకు 'వెట్టతనము గల్పింపఁగల తేనెటీఁగలు నిట్టి దీర్ఘనిద్ర నొందవు.
మానవ జీవితచరిత్రయందు నిద్రకు సంబంధించిన విచిత్రాంశములు కొన్ని కన్పించుచున్నవి. జగజ్జేత అలెగ్జాండరు పర్షియా చక్రవర్తి డెరయస్ మీఁదఁ బ్రచండయుద్ధమును బ్రకటించునాఁడు సుదీర్ఘమగు నిద్ర నొందినాఁడఁట! ఒకానొక యత్యవసరమైన రాచకార్యమునకై యతనిని మేల్కొల్ప సేనా నాయకుఁడగు 'పర్నీనియస్' ఎంతయో యత్నించి విఫలమైనట్లు గ్రీసు దేశచరిత్రల వలన వ్యక్తమగుచున్నది.
ఆత్మహత్యఁ జేసికొన నిశ్చయించుకొనిననాఁడు 103[1]కేటో చక్రవర్తికి దీర్ఘనిద్ర పట్టినదట
సెక్టస్ పాపేను జయింప వలసిన సమయము. సముద్ర యుద్ధ మతి తీవ్రతరముగ సాగుచున్నది. తాను నాయకత్వము వహింపవలయును. లేకున్న సమస్తమును దారుమారై తీవ్రతమ ప్రమాదము సంభవించును. అట్టిస్థితిలో 104[2]‘అగస్టస్ సీజరు' మృత్యువుతోఁ దుల్యమైన నిద్ర నొందినాఁడు. ధైర్యమొనర్చి తానే సర్వసేనాధిపత్యమును స్వీకరించి, శత్రువుల హతమార్చి విజయముతోఁ దిరిగి వచ్చిన మహాసేనాని ‘ఎగ్రిపా’, బహుకాలము విజయవార్తను దెల్పుటకై యీ సీజరు మేల్కొను నంతవఱకు వేఁచియుండవలసి వచ్చినది.
దీర్ఘ నిద్రయం దుండియే కొందఱితరులు జాగ్రదవస్థలోఁ జేయఁగల కార్యకలాపములను నిర్వర్తింపఁ గలరు. జేన్ రైడర్ - అను పదునైదేండ్ల కన్యక నిద్రావస్థలో నెన్నియో గ్రంథములఁ జదివినది. ఆమెకు జాగ్రదవస్థయందును నందలి
విశేషము లన్నియు జ్ఞప్తియుండుట విశేషము. ఆమె నిదురింప నారంభింప నదే- ↑ 103. కేటో - (క్రీ.పూ. 183 ప్రాంతము) రోమను రాజనీతిజ్ఞుఁడు, సేనానాయకుఁడు, రచయిత, వ్యవసాయముపై 'డిరెరెస్టికా' యను గ్రంథమును వ్రాసినవాఁడు.
- ↑ 104. అగస్టస్ సీజరు రోమక సామ్రాజ్య చక్రవర్తి. ఎగ్రిపా - క్రీ.పూ. 63 - జూలియస్ సీజరు వధానంతరము వచ్చిన యుద్ధములఁ బైకివచ్చిన సేనాని
____________________________________________________________________________________________________
62
వావిలాల సోమయాజులు సాహిత్యం-4