Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/616

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యోగ్యతలు గల మహనీయుడు. ఈ మహాపురుషుని గూర్చి ఆధునికులు చేసిన ప్రశంసలు పరికింపఁదగినవి. "తిక్కన ఆంధ్ర మహాపురుషుఁడు. కూలంకష ప్రజ్ఞాధురీణుఁడు. శ్రీమంతుఁడు. ఆముష్యయణుఁడు. కావ్యకళాజనిభూమి. అన్వయోద్ధారుఁడు. నిరతిశయ వివేకోన్నిద్రుఁడు. బ్రహ్మవేత్త, కృతిభర్త, మంత్రి మాణిక్యము, దండాధీశుఁడు. సర్వాంధ్ర లోకపూజనీయుఁడు." (శ్రీ ఆండ్ర శేషగిరిరావు). ‘అద్వైతమత' బోధ మాంధ్రభాషలోఁ జేసిన ఆచార్యులలో సోమయాజి మొదటివాఁడు (శ్రీ గురజాడ రామమూర్తి). 'తిక్కనను ఆంధ్రవ్యాసుఁడనుట కాటంకమేమున్నది?' (కవిత్వవేది). 'తిక్కనకు ఆంతరంగిక శిష్యుఁడును, పరమ భక్తుఁడునునైన సూరన తిక్కనను నవీన పరాశరుఁడని యననే యనినాఁడు గదా!' 'తిక్కన విద్యారణ్యస్వామికిఁ బూర్వరంగ ప్రవర్తకుఁడు' (శ్రీ పింగళి). 'దక్షిణాపథము తురుషాక్రాంతము గాకుండ తరువాతి శతాబ్దిలో విద్యారణ్యస్వామి ఏ కృషిసల్పైనో ఆ ప్రయత్నమునే తత్పూర్వ శతాబ్దిలో భారతరచనలవలన తిక్కన మహాకవి యొనర్చెను.' - శ్రీ నండూరి రామకృష్ణమాచార్య.

తిక్కన యుగపురుషుఁడు

తిక్కన కాలమునాటికి రాజకీయ మత సారస్వత రంగములలో విభిన్నత విశేషముగా నున్నది. ఆంధ్రదేశమున చిల్లర రాజ్యములు తమలోఁ దాము బోరాడుకొనుట వలన నొక మహాసామ్రాజ్య నిర్మాణము వంకకు రాజన్యుల దృష్టి ప్రసరించుట లేదు. ఒక వంక బ్రహ్మ నాయుఁడు ఆరంభించిన వీరవైష్ణవము, మఱియొక వంక అద్వైతమునకు ప్రతిస్పర్ధిగా విజృంభించిన వీరశైవము ప్రజలలో మతోద్రేకములు రేకెత్తించుచున్నవి. వారు వర్ణాశ్రమ ధర్మరాహిత్యమును, కర్మతిరస్కారమును, అన్యదేవతా దూషణమును ప్రబోధించుచు వచ్చిరి.

సాహిత్యరంగమున పాల్కురికి సోమనాది వీరశైవ కవులు 'జాను తెనుఁగు', 'దేశి కవిత' అను పేరులతో నొక నూతన కవితను గొనివచ్చి, శైవేతరులైన నన్నయాదుల మార్గకవితను ఖండింపనారంభించిరి. ఇట్టి అనైక్యము కారణముగా రాజకీయ మతసారస్వతరంగములలో విభిన్నత కలిగి దానివలన జాతి జీవశక్తి విచ్ఛిన్నమై నీరసింపదొడగెను. ఇట్టి స్థితిలో మహాపురుషుడైన తిక్కన సోమయాజి యవతరించి సర్వరంగములలో సమన్వయమార్గమును సూచించి ధర్మాద్వైతస్థితికి మూలస్తంభమై నిల్చి యుగపురుషుఁడైనాఁడు. రాజకీయ రంగమున మనుమసిద్ధిని కాకతీయ గణపతిదేవ చక్రవర్తికి సామంతునిగాఁ జేసి విశాలాంధ్ర సామ్రాజ్య స్థాపనకు


616

వావిలాల సోమయాజులు సాహిత్యం-4