మార్గములతోడను, ఉత్తమాంధ్ర కవుల మార్గములు పోల్చినచో విశేష భేదము గోచరించును. ఆంధ్ర కవిత్వమునకు ఋషిమూర్తులైన కవిత్రయము పెట్టిన ఒరవడి తప్పి ఎప్పటికప్పుడు కర్ణాట మహారాష్ట్ర ద్రావిడాది భాషల ననుసరించుచు, మఱల నాంధ్రకవి ఋషిమార్గమును జూచుకొని సరిదిద్దుకొనుటయే ఆంధ్ర కవిత్వ చరిత్రలో ప్రధాన సూత్రమని తదిజ్ఞులకు గోచరింపక మానదు" - శ్రీ నోరి నరసింహ శాస్త్రి - ఆంధ్రకవుల ఆదర్శములు. భారతి - సర్వజిత్తు, వైశాఖము.
తిక్కన సోమయాజి
తిక్కన సోమయాజి గౌతమ గోత్రుడు. ఇమ్మహనీయుఁడు కొన్ని తరములుగా కవులును, మంత్రులును, దండనాథులునై ఆంధ్రజాతిని సేవించి ప్రతిష్ఠ గడించుకొన్న కొట్టరువు వంశమున జన్మించినాఁడు. తిక్కన తాత సారకవితాభిరాముఁడైన మంత్రిభాస్కరుఁడు. గుంటూరు విభుఁడు. తండ్రి సాంగవేదవేదియైన కొమ్మన. ఇతఁడు దండనాథుఁడు. ఇతని అన్న కుమారుఁడు ఖడ్గతిక్కన - కదనభీముఁడని విఖ్యాతిగన్న శూరాగ్రగణ్యుఁడు. తిక్కనయు మనుమసిద్ధి మహీపాలుని మంత్రియై యున్నాడన్నచో యుద్ధనిపుణుఁడు ననియు భావింపవలసియున్నది. మహారాజుచే 'మామా' అనిపించుకొన్న పరమాప్తుఁడు. వైదిక మార్గవర్తనమున యజ్ఞమొనర్చి సోమయాజియైన కర్మిష్ఠి. బ్రహ్మవిద్యావేత్త. తిక్కన మహోదార ప్రవృత్తిని రమణీయరూపమును నాతని శిష్యుఁడైన కేతన దశకుమారచరిత్రలోని అవతారికలో నొక శబ్దచిత్రణమొనర్చి చూపినాఁడు.
మనుమసిద్ధి క్రీ.శ. 1248లో రాజ్యమునకు వచ్చి క్రీ.శ. 1262 వఱకును నెల్లూరు చోళ రాజ్యమును పాలించిఁనాఁడు. అతఁడు సింహాసన మెక్కునాఁటికి తిక్కనకు నలుబది సంవత్సరముల ప్రాయముండుననియును, అయినచో తిక్కన క్రీ.శ. 1208 ప్రాంతమున జన్మించి యుండవచ్చుననియు చరిత్రజ్ఞుల యూహ. తిక్కన సహస్రమాసజీవి. కావున నతఁడు క్రీ.శ. 1288 ప్రాంతమున పరమపదించి యుండవచ్చును. ఈ రీతిగా తిక్కన జీవితము క్రీ.శ. 13వ శతాబ్ది ఆదినుండి అంతమువఱకును విస్తరించినట్లు కన్పట్టుచున్నది.
ధర్మార్థ కామమోక్షస్థితికి మూదల (కుదురు) ఐనదియును, బహువిధ కథామర్మములతోను, అనేక వైది విద్యారహస్యములతోను రాజ్యతంత్రములతోను నొప్పిన మహాభారతము నాంధ్రీకరించుటకు తిక్కన సోమయాజి సర్వవిధములైన
సాహిత్య విమర్శ
615