Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/614

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జూపిరి. నన్నయ భారతముననున్న వైదిక దృష్టి మిగిలిన యిరువురకును గలదు గావున, వారు చూపిన నిదర్శనములవంటివానిని తిక్కన, ఎఱ్ఱనల కవిత్వభాగములు నుండియు చూపవచ్చును.

ఆంధ్ర శాతవాహన రాజుల కాలమునుండియు నాంధ్రదేశమున నెలకొనియున్న వైదిక మార్గసంపత్తిని సుస్థిరముగ నిల్పి ఇతర దక్షిణ దేశ ప్రాంతములలోవలె బౌద్ధ జైన వీరశైవ వీరవైష్ణవ మతోద్రేక ప్రవాహములలో నది కొట్టుకొనిపోవకుండుటకు కవిత్రయము వారు మువ్వురును వారి వారి కాలములలో శ్రమించి కృతకృత్యులైనారు. మువ్వురును వేదమూర్తులు. వైదికాచారసంపత్తి గలవారు. మీదుమిక్కిలి తిక్కన యజ్ఞకర్త. ఒకవేళ నన్నయ కొన్నిచోట్ల స్వతంత్రించి వైదిక కర్మలను వైదికాచారములను పొగడిననునంతమాత్రమున నన్నయకు కావ్యకళాదృష్టి లోపించినదని చెప్పుట కవకాశము లేదు.

“తన్నుఁ గూర్చి నన్నపార్యుఁడే” లోకజ్ఞు నుభయ భాషాకావ్య రచనాభిశోభితు, సత్ప్రతిభాభియోగ్యు... మత్యమరాధిపాచార్యు" ఇత్యాదిగాఁ జెప్పుకొనినాఁడు. కవిబ్రహ్మ (తిక్కన సోమయాజి) గూడ నన్నయను 'ఆంధ్రకవిత్వ విశారదుండు, విద్యాదయితుఁడు' అని పొగడినాఁడు. రాజసూయము, ద్రౌపదీవస్త్రాపహరణము, నలచరిత్రము, మున్నగురమ్యతమ ఘట్టముల నన్నయకన్నఁ దిక్కనయేనియు రచించి యుండునా యనితోచుచున్నది. మొత్తము మీద కవిత్రయము వారి కవితామార్గము ఇంచుమించుగ నొకటియే. కావ్యకళాదృష్టి యందును నన్నయభట్టు తరువాతి యిరువురకును మార్గదర్శి (శ్రీ గుఱ్ఱం వేంకట సుబ్బరామయ్య).

"సత్యమునకు కవిత్రయము వారు మువ్వురును వైదిక మార్గవర్తనులు, దైవభక్తులు, సదాచారులు, ఉత్తమ పండితులు. కవితాతపస్సు చేసి కాంక్షితార్థములను అంతర్వాణి యుద్బోధముతో నందుకొని కావ్య రచన గావించినారు" (శ్రీ వేటూరి. మువ్వురు పురాణధోరణిలోనే కావ్యశయ్యను మేళవించి తమ పవిత్రవాక్కులనెడి నిక్షేపములతో తరువాతి కవి కుటుంబములవారికి బంగారు పూలమచ్చుల నిచ్చినారు.

కవిత్రయమువారు చూపిన కవితామార్గమునకుఁగల ఔత్కృష్ట్యమును గూర్చి యొక యాధునిక విమర్శకుఁడిట్లు తెలిపినాడు “వారు (కవిత్రయము) ముగ్గురును త్రేతాగ్నుల వలె పవిత్రమూర్తులు. వారి వైదిక ధర్మతత్పరతయే మార్గదర్శకముగానుండి, ఆంధ్ర కవిత్వమునకు సంస్కృతగౌరవము నధికముగా చేకూర్చినది. ఆంధ్ర కవిత్వము అవతరించుటకు బూర్వమే అనేక కావ్యములు పుట్టిన కన్నడాది భాషలలోని ప్రసిద్ధ


614

వావిలాల సోమయాజులు సాహిత్యం-4