Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/613

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ్యాసభారత మహత్త్వము దానియందుఁ గన్పట్టదు. కావున క్రీ.శ. 1022 మొదలు 1063 వఱకును వేఁగీమండలములోని రాజమహేంద్రవరము రాజధానిగా ప్రాగాంధ్రదేశమును చాలించిన తూర్పుచాళుక్య చక్రవర్తి రాజరాజనరేంద్రుని యభ్యర్థనమున అతనికి రాజపురోహితుఁడును, ఆస్థాన విద్వత్కవియును, మహాత్ముఁడునైన నన్నయభట్టు వ్యాస భారతాంధ్రీకరణమునకుఁ బూనుకొని పదునెనిమిది పర్వములలో ఆది సభాపర్వములఁ బూర్తిగను, ఆరణ్యపర్వములోఁ గొంతభాగమును ఆంధ్రీకరించి'గాసట బీసటలు జదివి గాథలు త్రవ్వి' యానందించునాంధ్రజాతికి నుద్గ్రంథ రచనకు మార్గమును జూపినాఁడు.

ఈ నన్నయభట్టు ఆంధ్రభాషకు ప్రథమ ప్రవక్త. శబ్ద శాసన బిరుదాంకితుఁడు. అటుపిమ్మట నూటయేఁబది సంవత్సరములకు నెల్లూరి తెలుఁగు చోళరాజైన మనుమసిద్ధికి హితుఁడును, మంత్రియు, ఆస్థానకవీశ్వరుఁడును, 'ఉభయకవిమిత్ర', 'కవిబ్రహ్మ' బిరుదాంకితుఁడును, కావ్య కళాశిల్పమున నసమానుఁడునునైన తిక్కన సోమయాజి క్రీ.శ. 1260 ప్రాంతమున విరాటపర్వముతో నారంభించి స్వర్గారోహణము వఱకును గల పదునైదు పర్వములను ఆంధ్రీకరించినాఁడు. తఱువాతి కాలమునందలి ఆంధ్రసాహిత్యకు లీతని 'ఆంధ్రవాఙ్మయ స్థితికి మూలమై నిల్చిన వానినిగా' భావించిరి. క్రీ.శ. 1300 మొదలు 1360 మధ్యకాలమున అద్దంకి రాజధానిగా ప్రాగాంధ్రదేశమునఁ గొంతభాగమును పాలించిన ప్రోలయ వేమారెడ్డి యాస్థాన కవియును 'శంభుదాస' 'ప్రబంధ పరమేశ్వర' బిరుదాంకితుఁడునైన ఎఱ్ఱన ఆరణ్యపర్వశేషమును నన్నయ రచనగాఁ బూరించినాఁడు.

ఈ రీతిగ వివిధ కాలములలో వ్యాసభారతము నాంధ్రీకరించి ఆంధ్రజాతికిఁ గాన్కవెట్టిన నీ కవీశ్వరులు మువ్వురును ఆంధ్ర సారస్వత ప్రపంచమునకు త్రిమూర్తులు. నీ కావున వీరికి కవిత్రయమను నామము సాహిత్యలోకమున రూఢమైనది. "సంస్కృత భారతమొక బంగారు ముద్ద. తెలుఁగు భారత మందులోనుండి కొంత బంగారమును తీసి మంచి పనివానితనముతోఁ దీర్చిన యొక యమూల్యాభరణము" - శ్రీ కొమఱ్ఱాజు లక్ష్మణరావు.

భారత కవుల దృక్పథము

నన్నయభట్టు భారతమును వైదికదృష్టితోను, తిక్కన కావ్యకళాదృష్టితోను రచించినారని, శ్రీ కోరాడ రామకృష్ణయ్య వారి 'ఆంధ్రభారత కవితా విమర్శనము' అను గ్రంథమున నొక అభిప్రాయమును వెల్లడించి నిదర్శనములను గొన్నింటిని


సాహిత్య విమర్శ

613