Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/611

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సీ.
"ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని,
     యధ్యాత్మ విదులు వేదాంతమనియు,
నీతివిచక్షణుల్ నీతిశాస్త్రంబని
     కవి వృషభులు మహాకావ్యమనియు,
లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని
     యైతిహాసకు లితిహాసమనియుఁ
బరమ పౌరాణికుల్ బహుపురాణసముచ్చ
     యంబని మహిఁ గొనియాడుచుండ


వివిధ వేదతత్త్వవేది వేదవ్యాసుఁ
డాదిముని పరాశరాత్మజుండు
విష్ణుసన్నిభుండు విశ్వజనీనమై
పరగుచుండఁ జేసె భారతంబు.”

ఆ మహాకవియే 'భారత భారతీ సముద్రము దరియంగ నీదుటకు' విధాతృనకైనను నేర్పు చాలదని చెప్పినాఁడు.

భారతము - పురాణము, ఇతిహాసము, వేదము, జయము

కౌరవ పాండవ వంశచరిత్రనాధారముగా గ్రహించి వ్యాసమహర్షి యిందనేక రాజవంశముల చరిత్రలను సంగ్రహించుటవలన భారత మితిహాసము. పురాణ లక్షణములగు సృష్టి, ప్రతిసృష్టి, రాజవంశచరిత్ర, మనువుల కాలములలో జరిగిన విశేషములు, రాజవంశముల యవాంతర శాఖలను దెల్పుటయనెడి పంచలక్షణములతో నొప్పుచుండుటచే నీ భారతము పురాణము వేదార్థములను బోధించునది,వేదనామమును ధరించునది యగుటచే భారతము 'సంహిత'. లోకాగమన్యాయైకాంత గృహమును నానా వేద వేదాంతయుక్తమును నగుటచే పంచమ వేదము. ధర్మార్థ కామ మోక్షము లనెడి చతుర్విధ పురుషార్థములను సాధించునది యగుటచే జయము.

భాగములు: భాగనామములు

లక్ష శ్లోక పరిమితి గల యీ మహాగ్రంథరాజము 'పర్వము' అనెడి భాగనామములతో నొప్పుచున్నది. ఒక పర్వముకంటె నొక పర్వమున రసాధిక్యమగుటచే నీ భారతాంతర్గతములైన భాగములకు 'పర్వములు' (కణుపులు) అను నామము కలిగినది.


611

సాహిత్య విమర్శ