శ్రీమదాంధ్ర మహాభారతము - శ్రీకృష్ణుని రాయబారము
కవి కాలాదికము
సంస్కృత భారతము - వ్యాసమహర్షి
వేదసాహిత్యము మహారణ్యమువలె వృద్ధినొందగా దానినంతటిని క్రమరీతిని విభజించి సత్యవతీపుత్రుఁడైన కృష్ణద్వైపాయనుఁడు వేదవ్యాసనామము వహించెను. అటుపిమ్మట నా మహర్షి అష్టాదశ పురాణములను జెప్పి యంతటితోఁ దృప్తినొందక చతుర్వేద సారమును, 'పంచమవేద' మని ఖ్యాతి వహించిన మహా గ్రంథమునునైన 'భారత సంహిత'ను రచించెను. ఈ భారతము ప్రాచీన భారతీయ విజ్ఞానము సంస్కృతుల (An encyclopedia of Indian wisdom & culture) కొక సర్వస్వమని చెప్పఁదగిన గ్రంథము.
ఇది పాండవుల సత్యశీలమును, ధార్తరాష్ట్రుల దుర్వృత్తిని, శ్రీకృష్ణమాహాత్మ్యమును వెల్లడించుచున్నది. ఇది పూర్వరాజన్యచరిత్రమును జెప్పుటచే నితిహాసము. 'బహుశా ప్రపంచమందలి తొలి చరిత్రకారుఁడు వ్యాస భగవానుడే' (శ్రీ కె.యమ్. మునీ).
వ్యాసమహర్షి ఈ యితిహాసమును కావ్యగౌరవమొప్పగా రచించినాఁడు. ప్రాచీనులే గాక యాధునికులును వ్యాస భారతమును మహా గౌరవముతో బఠించుచున్నారు.
వ్యాసమహాభారతమును గురించి యొక ప్రముఖ నాయకుఁడు, సాహితీవేత్త ఇట్లు చెప్పుచున్నాఁడు.
"Mahabharata is a noble poem possessing in a supreme degree the characteristics of a true epic, great and fateful movement, heroic characters and stately diction. (It) discloses a rich civilization and a highly evolved society, which, though of an older world, strangely resembles the India of our own time with the same values and ideas. The Mahabharata has moulded the character and civilization of one of the most numerous of the world's people."
- C. Rajagopalachari
సాహిత్య విమర్శ
609