ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చంద్రవంశజుల పరిపాలనమున చంద్రవంశ చరిత్రయము భారతమును, సూర్యవంశజుల పాలనమున సూర్యవంశ చరిత్రయగు రామాయణమును ఆంధ్రీకరణములయ్యెను. ఇది ఆ కాలపు సారస్వత చిత్తప్రవృత్తి.
కావున ఆంధ్రసారస్వత ప్రథమావస్థలో రాజన్యుల వంశచరిత్ర రచనములే సాహిత్యలోకము నాకర్షించినవనవచ్చును. దానికి రాజన్యులే కారకులు. భారత రచనము వలన మతాభివృద్ధియు, భాషాపోషణమును, అవాంతరఫలములు. ముఖ్యోద్దేశ్యము వంశచరిత్ర రచనమే.
608
వావిలాల సోమయాజులు సాహిత్యం-4