Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/604

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సామరస్యాన్ని భారతదేశంలో ప్రచారం చేయ మొదలుపెట్టినవారు నామదేవ్. విగ్రహారాధన ఇతనికి గిట్టదు. కల్పసమస్తానికీ స్వస్తి చెప్పాడు. ఏకేశ్వరోపాసకుడు, రామానందుడు కులతత్త్వాలను రూపు మాపడానికి ప్రచారం సాగించాడు. కబీరు తరా, ఉపవా, మూలాతిలకాదులను తూర్పార బట్టాడు. తన కూతురు కమలిని ఒక బ్రాహ్మణుడికిచ్చి వివాహం చేశాడు. అతని శిష్యుడు రవిదాసు చమరుడు. మేవారు రాజకుమార్తె ఝూలీకి మతగురువైనాడు. గోరఖప్పురంలో అతని సమాధి వద్ద నేడు హిందువులు, ముసల్మానులు ఏకంగా ప్రార్థిస్తారు. హిందువులలో అనేకులు నేటికీ కబీర్ పంథీయులమని చెప్పుకుంటూ ఉన్నారు. సంత్ సయ్యద్ హసన్ వద్ద ఉపదేశాన్ని పొందిన తరువాత మక్కా వెళ్ళి తన భావాలు ప్రచారం చేశాడు. అతని బోధామృతము అరబ్బీ భాషలోకి పరివర్తితమైంది. నానక్ మహాశయుని దర్గాలో చాలా కాలం నివాసం చేశాడు. నానక్ మహాశయుడు సిద్ధి పొందినప్పుడు దేహాన్ని మాదని ముసల్మానులూ, మాదని హిందువులూ తగవులాడుకున్నారు. చైతన్యుడు ముసల్మానులను కూడా శిష్యపరంపరలో చేర్చుకున్నాడు. యవన హరిదాసు వారిలో ప్రముఖుడు. సనాతన రూప్ అనే అతని శిష్యుల మతసహనాన్ని జూచి సహించలేక, సనాతనులు వారిని పంక్తిబాహ్యులను చేసి వేశారు. అస్సాంలో కాయక్త శంకర దేవు 'మహా పురుషీయులు' అనే మరొక మతసంప్రదాయానికి మూల పురుషుడైనాడు. అతడు అనేకమంది ముసల్మాను శిష్యులనూ అంగీకరించాడు. బ్రాహ్మణగురువులు ఆయన్ని అంగీకరించలేదు. వంగ దేశంలోని సనాతన గోస్వామి దర్వేషీయులు అనే మరో సంప్రదాయానికి చెందినవాడు. అతని అనుయాయులు అల్ ఖల్లా అల్ అనే ముసల్మాను ఫకీరుల దుస్తులను ధరించేవారు. జపమాలను ఉపయోగించేవారు. హిందువులలోని సైనీయులు బహుచిత్రమైన వారు. గోమాంసాన్ని భక్షిస్తారు. మక్కానుంచి వచ్చే ఖాఖ్యపార్ అనే జపమాలను ఉపయోగించేవారు. వాళ్ళ ప్రధాన సూత్రము 'పీర్ సత్ హై' (గురువు సత్యము) అనేది.

ఈ సంప్రదాయాలను ప్రవక్తలందరూ విశేషంగా బ్రాహ్మణేతరులు, ముసల్మానులు, ఇస్లాం మతప్రచారం ప్రారంభించిన తరువాత, హిందూమతం గురుపీఠం కేవలం బ్రాహ్మణకులాన్నే పట్టుకొని నిలిచిపోలేదు. యజ్ఞ యాగాది క్రతువులూ, తత్ఫలితాలు సశరీర స్వర్గాలూ జనసామాన్యుల మనస్సును ఆకర్షించలేకపోయి ఉండవచ్చు. హిందూ వేదాంత, ఉపన్యాసాలు ప్రజాహృదయాలకి హత్తుకోవటం మానివేసినవి.

(అముద్రితం)


604

వావిలాల సోమయాజులు సాహిత్యం-4