ఖలీఫా సైనికులు జయించిన అబూ ఖుభార్, బోడోమను, క్రిస్టియన్, జూజాతులకు మతస్వాతంత్ర్యము ఉండనే ఉన్నది. కాని టర్కులు ఇటువంటి మార్గాన్ని అవలంబించలేదు. జయించిన దేశాల్లోని ప్రజలను బలవంతపెట్టి తమ మతం ఇచ్చారు. దానికి అంగీకరించని వారిని మృత్యువుకు బలి ఇచ్చారు.
భారతదేశంలో ఇస్లాం మతవ్యాప్తికి అనేకమంది ఫకీరులు పాటుపడ్డారు. సూఫీలు, ఫకీరులు మత ప్రబోధం చేసే మార్గంలో సర్వమత సామాన్య ధర్మాలు నిబద్ధమై ఉండటం చేత ఆ మతానికి ఏ హిందువులూ వ్యతిరేక ప్రచారం పాటించలేదు. దర్గాలలో ముసల్మానులూ, హిందువులూ కలిసి ఫకీరుల పలుకులు వింటూ వచ్చారు. క్రీ.శ. 750లో మలబారు దేశాన సంత్ మాలిక్ దివాన్ ఇటువంటి ప్రచారం ప్రారంభించాడు. ఇతరులు అనుసరించారు. అజ్మీర్, ఢిల్లీ, పాక్ పటాన్, పానిపట్, కచ్, గుల్బర్గా, షిలట్ మొదలైన ప్రదేశాల్లో ఇతని మార్గాన్ని అనుసరించి ప్రచారం సాగింది. షియోసన్ సంత్లు ఇస్లాం మతప్రచారానికి హిందూమత పారిభాషిక పదాలను ఉపయోగించారు. 'మైనుద్దీన్ చిష్టి' కాలం నాటికి ఇస్లాం ప్రచారం బహుళంగా ఉన్నది. అజ్మీర్ దగ్గిర ఉన్న పుష్కరంలో అతను ప్రచారార్థం నివాస మేర్పరుచుకున్నాడు. ఇతనికి హిందువులు అనుయాయులు. ఈ నాటికీ అజ్మీర్ దగ్గర కొందరు హుస్సైనీలు (బ్రాహ్మణులు) కనిపిస్తూ ఉంటారు. వారికి తాము అటువంటి వారని చెప్పుకోవడం చాలా గర్వకారణము. తాము ఆదర్శవాదులు అని వారు చెప్పుకుంటారు. రంజాను పండుగలో పాల్గొంటారు. మగవాళ్ళు ముసల్మాను దుస్తులు వేసుకుంటారు. స్త్రీలు ముఖాన కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. చనిపోయినవారికి దహనసంస్కారం చేస్తారు. 'సుంతీ' ఆచారాన్ని ముసల్మాను మార్గాన్నే అవలంబిస్తారు. ఫకీరులు ఇస్లాం మతం ఇప్పించిన గుజరాత్లోని కాకాలు నేటికీ హిందువుల పేర్లే ఉంచుతున్నారు. షామీలు, ఇస్లామీలు భోజా సంఘానికి చెందిన హిందువులు. విగ్రహారాధనను అంగీకరించకుండా, గీతాపారాయణం చేసే షాప్ దీన్ టిబెరి తమ మూలపురుషుడని వారు చెప్పుకుంటారు. ఈ వంశస్థులు ఆగాఖానన్ను త్రిమూర్తుల అంశవల్ల జన్మించిన అవతారమూర్తి అని నమ్ముతారు.
పదిహేనవ శతాబ్దం నాటికి ముసల్మాన్ సంత్లు, ఫకీరులు తరువాతి కాలంలో హిందూ ముస్లిమ్ మతసామరస్యానికి ప్రచారం చేసిన నింబార్క, నామదేవ్, రామానంద, కబీర్, నానక్, చైతన్య, కాశ్మీర దేశస్త్రీ ప్రవక్త లీలావ్యాకరణ వంటివారు జన్మించటానికి తగిన అవకాశాన్ని కల్పించి పరిస్థితులు సుగమం చేశారు. మత
సాహిత్య విమర్శ
603