Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/601

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విభేదులైన ఈ టర్కులకూ, ఆఫన్లూ విశేషమైన సంస్కృతిగాని, రూఢమైన మతాచార వ్యవహారాలు కలవారుగాని కారు. ఆఫ్గనిస్తాన్ వారి జన్మదేశం. మధ్యాసియాను వదిలి దండయాత్రలు చేస్తూ వారు ఆక్రమించుకున్న దేశాల్లో వారికి పూర్వంలో ఉన్న మతాలను స్వీకరించి, ఆ ఆచార వ్యవహారాలతో కాలం వెళ్ళబుచ్చు కుంటూ వచ్చారు. అందువల్లనే రష్యా, జార్జియాల మీద దండెత్తిన టర్కులు - కొందరు కొనక్కులు, కొందరు క్రైస్తవులుగా మారిపోయినారు. చైనాలో వారు బౌద్ధమతాన్ని స్వీకరించినారు. అరేబియాలో ముసల్మానులైనారు.

భారతదేశానికి రాకముందే ఈ ఆఫ్ఘన్ - టర్కులకు, ఇస్లాంతో సంబంధం కలిగింది. వారు ఇస్లామును స్వీకరించారు. అలా జరగకపోయి ఉంటే భారతదేశానికి వచ్చి నివాస మేర్పరచుకున్న శకులు, సిథియనులు, హూణులు, బాక్ట్రియా యవనులవలె హిందూమతాన్ని స్వీకరించి ఉండేవారు.

టర్కులు, ఆఫ్ఘన్లు మన దేశాన్ని జయించారన్న మాటేగాని వారికి సాంస్కృతికమైన విజయం కలగలేదు. వారి సంస్కారం కంటే ప్రశస్తమైన మరో సంస్కారము, అతి పురాతన కాలం నుంచీ భారతదేశంలో సజీవంగా ఉంటూ వస్తూ ఉన్నది. ఇస్లాం ప్రభావం వల్ల ప్రధానమైన మత సాంఘిక నైతిక విషయాల్లో ఎటువంటి మార్పులూ కలగలేదు.

సెమెటిక్ జాతికి చెందిన అరబ్బులుగానీ, ఆర్యజాతికి చెందిన పర్షియనులుగానీ భారతదేశాన్ని జయించి ఉన్నట్లయితే, భారతదేశంలోని ఇస్లాం చరిత్ర మరొక విధంగా ఉండేది.

టర్కులు, ఆఫ్ఘన్ లు మధ్య ఆసియాలో బయలుదేరి జగద్విజయం చేసుకుంటూ వస్తున్నారు. ముందు వారికి ఇస్లాంతో సంపర్కం కలిగింది. వారు దాన్ని స్వీకరించారు. మహమ్మదీయుల మీద దండయాత్రలు చేయటానికి బయలుదేరారు. వారు చెప్పినవే మతసంప్రదాయాలని అంగీకరిస్తూ వచ్చారు. ఇస్లాం మతాన్ని నమ్మని వారిమీద యుద్ధం చేస్తూ, ఒక ముసల్మాను మృతి నొందితే అతన్ని 'షాహిద్' (దేహత్యాగి) అనేవారు. ఒక ముస్లిమేతరుణ్ణి చంపితే 'ఘాజీ' అవుతాడు. షాహిద్ కైనా, ఘాజీకైనా స్వర్గం తప్పదు. పశుబలంతో మానవులను చెల్లాచెదరుచేస్తూ రక్తదాహం తీర్చుకుంటున్నా అతడు ఘాజీ షాహిద్ పదవిని పొందుతున్నాడు. ఏ విధంగా విజేతల మూలంగా క్రైస్తవ మత మూల ధర్మాలలో మార్పు కలిగిందో, అదేరీతిగా ఆఫ్ఫన్ టర్కుల మూలంగా ఇస్లాం మతంలో అనేకమైన మార్పులు సంభవించినవి. ఖ్యాతినార్జించటమూ, రణ కండూతి తీర్చుకోటమూ, దేశసంపాదనా - ఇవి మూడూ


సాహిత్య విమర్శ

601