(శ్రీ కృష్ణ శాస్త్రి) 'ఆంధ్రదేశ రచయితలందరిలో ఉన్నత హృదయుడు'. (శ్రీ శివశంకరశాస్త్రి). ఇత్యాదిగా సమకాలికులలో సోదర రచయితల అనురాగాన్ని ఆర్జించాడు. 'మా సాహిత్య గురువు అని అనేకమంది సాహిత్య యువకుల గౌరవాన్ని ఆర్జించాడు. సఖిలో ప్రచురించిన వీరి కథలన్నిటికీ మిమ్ము అభినందిస్తున్నాను. కథ చాలా గొప్పగా ఉంది. మీ దోమల మహాబాధ చాలా బాగుంది. అట్లాటివి వ్రాయడంలో మీ సమానులు లేరు. ప్రతిభలో మీ కథ చాలా బాగుంది. చక్కగా సాధించారు ఇత్యాదిగా (చలం)
శ్రీ దీక్షితులు సారస్వతములో దివ్యజ్యోతి వెలిగించే బుద్ధితో రచన చేశారు. (శివశంకర స్వామికి శ్రీ చింతా దీక్షితులు ఉత్తరం 18-9-46) దేశ స్వాతంత్య్ర సంపాదక మహాత్మాగాంధీ ప్రభృతులైన మహానాయకులు, అరవింద ఘోష్ మొదలైన మహనీయులు ఆర్జించిన విజ్ఞానాత్మక, నైతిక, సాంఘిక జీవితాన్ని సాధించటం జాతీయ సంప్రదాయ వైరుధ్యాన్ని ఎదుర్కోవటం, ప్రాచీనాంధ్రత్వ వైభవాన్ని ఆటవిక గ్రామీణ జీవితాన్ని ప్రదర్శించటం మొదలైన కోరికలతో శిల్ప పరిపూరితమైన ప్రయోజనాత్మక సాహిత్య సృష్టి చేశారు. ఈ దృష్టితో బహుముఖీన ప్రయోజనాత్మక సాహిత్య సృష్టి చేసిన రచయిత ధార్మిక జీవితాన్ని గడుపుతూ వీరనుసరించిన దృష్టితో మరొకరు కనిపించరు. సమకాలిక రచయితలలో ఉత్తమ శక్తిమంతులైన ఉత్తమ కథకులలో అతి విశిష్టులు.
సాహిత్య విమర్శ
599