పాశ్చాత్య సాహిత్య విమర్శకుడు Graham Balfour కథారీతులను గురించి There are so far as I know, three ways and three ways only of writing a story. You may take, a plot and bit characters to it, or you may take a character incidents and situations to develop it, you may take certain atmosphere and get actions and presons to readers. అని అన్నాడు.
శ్రీ దీక్షితులు ఈ మూడు రీతులలోనూ కథలు రచించారు. వీరి కథలు సాహిత్యంలో ఆదర్శప్రబోధితాలూ ప్రచారకాలూ చమత్కారిత్వ శోభితాలు. మృదుహాస్యరస స్ఫోరకాలుగా కొన్ని సందర్భాల్లో వ్యంగ్య గర్భితాలుగాను నడిచాయి. 'వీరు సాహిత్య కథ' వంటి కథలను కథావస్తు వైచిత్రిలోను, హాస్య కథలను ఉత్తమ భావబోధకాలైనా కేవల హాస్యరస ప్రధానంగానూ నడిపించారు. జాతీయ సంప్రదాయాన్ని పరిత్యజించి అన్యమార్గాల్లో అనుసరించే విషయాలను గురించి వ్రాసిన వీరి వటీరావు కథలను, ఇంటబుట్టిన ఆచారాలకు, దిగుమతి అయిన ఆచారాలకు సంఘర్షణ జరిగినపుడు రాలే విస్ఫులింగాల వల్లే ద్యోతకం చేశారు.
పాత్రపోషణ
అనేక కథలకు ఇతివృత్తాల వలె రాజకీయ, సాంఘిక, ఆర్థిక, లైంగిక, స్థితులకు చెందిన ఒక వర్గానికి సంబంధించిన ఇతివృత్తాల వంటివి బహుముఖీనాలు. అందువలన వీరి పాత్రలు సైతం అనేక కథకుల పాత్రలవలె ఒక వర్గానికి చెందినవి మాత్రమే కాక, ప్రాచీన చారిత్రక వర్తమాన కాల వయోగుణభావ వృత్తి జీవిత విశేష బహువిధ వైవిధ్యం కలవి. కవిరాయడు - మహారాజులోని పాత్రలు ప్రాచీనకాల పాత్రలకు, శిలా ప్రతిమలోని పాత్రలు చారిత్రక పాత్రలకు, వటీరావు కథలోని పాత్రలలో అత్యాధునిక సాంఘిక పాత్రలకు, 'దూదేకుల పాప' ఇత్యాదుల్లోని పాత్రలను, ఆధునిక గ్రామీణపాత్రలకు చెంచు దంపతులు, చెంచురాణి (సఖి 1927) లోని పాత్రలు ఆటవిక జీవితపాత్రలకు, 'శ్యామల' లోని పాత్ర సఖ్య ప్రేమాది భావవిషయిక పాత్రలకు, ఎన్నో చేస్తాను మొదలైన కథల్లోని పాత్రలు, సూరి సీత వెంకి కథల్లోని పాత్రల్లో బాల జీవిత పాత్రలకూ ఇత్యాదిగా వీరి పాత్రలు పాత్ర వైవిధ్యానికి నిదర్శనాలు. శ్రీ దీక్షితులు గారు కథోచితంగా ఇలాంటి వివిధ పాత్రలను సృష్టించుకొని, వాటికి అనుగుణమైన రూప వేష (అలంకరణ) భాషా (సంభాషణ) చేష్ట (ప్రవర్తన) లను ప్రసాదించి పోషించి, మనోరంజకంగా కథలు నడిపి పాఠకులకు ఆహ్లాదాన్ని కలిగించారు. పాఠకులకు పాత్రలను నిత్యపరిచితాలు చేశారు. చెంచు దంపతులలో ఈరమ్మ, కవిరాజు వటీరావు
596
వావిలాల సోమయాజులు సాహిత్యం-4