Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/593

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సమకాలీన సాంఘిక జీవిత కథలతోను అత్యంత పరిచయం, ప్రీతి కలవారు. బహుముఖీన సాహిత్య సేవ చేసిన వీరు, ఈ కథలలో నచ్చినవాటిని గేయ, నాటికా బహువిధ కథాకథనాల్లో రూపొందించి తమ కథావస్తు వైవిధ్యాన్ని సాహిత్యప్రక్రియ భేదాల్లో పంచి ఇచ్చి, పాఠకులను ఆనందింపజేశారు. వీటిలో పేరుగాంచినవి రేణుక, తిరుప్పాణాళ్వార్ ఇత్యాదులు. కేవలం కథాకథన ప్రక్రియలోనే వీరి విశేష వైవిధ్యం ద్యోతకమవుతున్నది. అందువల్లనే 1925లో ప్రథమతః ముద్రించిన 'ఏకాదశి' కథాసంపుటికి వీరు ఉద్దేశించిన పాఠకలోకం బాల యౌవన వయోవృద్ధులు. వీరి ప్రక్రియలలో కథావృత్తాలు యువజన స్వేచ్ఛ, సఖ్యం, ప్రేమ పవిత్రత, మధుర దాంపత్యం, ఆదర్శప్రియత్వం, దేశభక్తి, జాతీయతా ప్రియత్వం, త్యాగం అవలంబించటం, నీతిబోధ, దేశీయాచార ప్రియత్వం, జాతీయ సంప్రదాయాలు వదులుకొని అన్యజాతి సంప్రదాయాన్ని అనాలోచితంగా పాటించటం హాస్యాస్పదమైనదని గమనింపచేసే యత్నం, “మగడు వేల్పన పాతమాటది, ప్రాణ మిత్రుడుగా నీకు” అన్న గురజాడ అభిప్రాయానికి సక్రమ నిరూపణ. బాలల మనో భావవర్తన శిక్షణాదికాలు, ప్రాచీన జానపద వీరత్యాగ స్వరూపాదులు. దూదేకుల పాట, హరిదాసు గంగిరెద్దుల రాకలు మొదలైన వాటితో కూడిన గ్రామసీమ సౌభాగ్యాదుల వంటి విశేషాలతో కథావృత్తాలు బహుళంగా నడిచి ఉండటంవల్ల, వైవిధ్యం విశేషంగా స్ఫురిస్తున్నది. కల్పనాసహజత్వం బాలసాహిత్యంలో అంతర్భాగంగా ఫెయిరీ టేల్స్ వంటి పాశ్చాత్యులు సైతం ఆదరించి రచించిన శ్రీ దీక్షితులు ప్రారంభ దశలో పిల్లలకు వ్రాసిన 'శంపాలత', 'లీలాసుందరి' వంటివి అభూత కథా కల్పనలు. వీటిలో తప్ప వీరి ఇతరకథలన్నిటి కల్పనలో సహజత్వమే గోచరిస్తుంది. 'శ్యామల' కథలో ప్రేమించిన యువతి మరణించటం వల్ల ప్రియుడు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవటం, వరూథిని కథలో మనస్సు మారి తనమీద ప్రేమ కలిగినపుడు తనదగ్గరకు వచ్చేటట్లు వరూథిని వరమిచ్చినా, వివాహితుడైన ప్రవరుడు, మనస్సు మారి మళ్ళీ వెళ్ళక, దాంపత్య ప్రణయపవిత్రతను నిలపుకొన్న ప్రవరుడి వంటివాళ్ళు ఉండటం అన్న విశేషాలకు లోకంలో ఎన్నో సహజ నిదర్శనాలు గోచరిస్తున్నవి. 'కవిరాయడు:' మహారాజు అన్న కథలో అనుగ్రహించని మహారాజు శిలామూర్తికి రచనలను వినిపించి అంకితమివ్వటం సహజమేనని అనటానికి ఎన్నో ఆధారాలు కనిపిస్తున్నవి. 'చెంచుదంపతులు' కథలో ఈరమ్మ తన లోపానికి పశ్చాత్తాపాన్ని పొంది, మరణించిన భర్త శవం పక్కనే సహగమనం చేయటం మూలంగా, చెంచువాళ్లు సైతం ప్రణయపవిత్రతను గొప్పగా పాటించేట్లు కల్పించటంలో అసహజత్వం అణుమాత్రం లేదు. 'శిలాప్రతిమ' కథలో బందిపోటు దొంగ రాజై


సాహిత్య విమర్శ

593