మంచివాడు కాదు అమ్మే మంచిదని చెప్పి, మరికొన్ని తండ్రి దోషాలు కూడా మొదటి సగంలో ఎన్నటం, రెండవ సగంలో అమ్మ మంచిది కాదు నాన్నే మంచివాడు అని పిల్లలు సంక్రాంతినాడు అమ్మ ముగ్గులన్నీ నన్ను పెట్టనివ్వదు, బొమ్మలన్నీ దాచి పెడుతుంది, ఈతపళ్ళు కొనుక్కోనివ్వదు, పొయ్యి దగ్గరికి రానివ్వదు, మొదలైన హేతువులు చెప్పటం 'ఎవరు మంచివారు?' కథావస్తువు. ఫెయిరీ టేల్స్ కథావస్తువుగా గల చింతా దీక్షితుల 'శంపాలత', 'లీలాసుందరి' అన్నవి రెండు నవలికలు అనదగ్గ అతి దీర్ఘబాల కథలు.
ఉద్యోగస్థుల భార్యలైన లేడీస్ క్లబ్ వార్షికోత్సవ సభల్లో ప్రతి సంవత్సరం వటీరావు ఎమ్.ఎ. (కళావతి) ప్రథమ బహుమానం పొందటానికి అనుసరించిన చిత్రాతిచిత్ర ప్రవర్తనలకు సంబంధించిన సన్నివేశకథలు శ్రీ దీక్షితులు 'వటీరావు కథలు' (నవ్య సాహిత్య పరిషత్తు హైదరాబాదు). 'మొదటి బహుమానం', 'మిసెస్ వి.కె. వటీరావు ఎమ్.ఎ.', 'నగ్నదిన మహోత్సవము', 'ఫ్యాన్సీ డ్రెస్ పారేడ్', 'మిస్సుల బహుమానం', 'సౌందర్య పోషణ' పద్ధతులు అన్న ఆరు ఈ సంపుటిని ఉన్న కథలు. బహుమానాన్ని పొందటానికి సభ్యురాళ్లు ప్రతి ఒక్కరూ భర్తలచేత చిత్రమైన పనులు చేయించాలని నిర్ణయించటం, దొరల దుస్తులు వేసుకొనే భర్త చేత పంచె కట్టించటం, తాను నవల చదువుకుంటూ సిగరెట్టు కాలుస్తూ భర్తచేత వంట ఇంటి పనులు చేయించటం, భర్తచేత చీర కట్టించి రవిక, గాజులు తొడిగి ఆడవేషం వేయించటం మొదలైన పనులను ఇతర సభ్యగణం చేస్తే, వటీరావు భర్తచేత శివుడి వేషం వేయించటం, జడ్జీలు వటీరావు భర్తచేత వేయించిన వేషానికి ప్రథమ శ్రేణికి చెందిందని నిర్ణయించి బహుమాన మిప్పించటం 'మొదటి బహుమానం' కథావస్తువు., భర్తలకు తీవ్రమైన అనుమానం కలిగేటట్లు సభ్యురాండ్రు పరపురుషులతో కలిసి నర్తించి తమ అభినయకౌశలాన్ని ప్రదర్శించి, బహుమానాలని పొందటం నిర్ణీతమైనపుడు ఇతర అభినయంతో సత్యాల కప్పి పుచ్చలేకపోతే వటీరావు భర్తకి అనుమానం కలిగేటట్టు భార్యతో వైరమేర్పడ్డ ఒక కొత్త యువ భర్తతో అతిసన్నిహితంగా నర్తించి బహుమానం పొందటం 'మిసెస్ వి.కె. వటీరావు' ఎమ్. ఏ కథావస్తువు.
సభ్యురాండ్రు ఒకచోట నగ్నదినోత్సవం చేసుకుంటామని, ఉల్లాసముంటే మీరు కూడా రావచ్చునని చెప్పటం, బీచి దగ్గరకు రమ్మని పిలిచి భర్తలు కనుక్కోలేకుండా దాసీలు ముసుగు వేషాల్లో రక్షించడం, పేరాపురంలో సభ్యురాండ్రు నిత్యం ఇళ్ళల్లో పనులు చేసుకొనే నగ్న రూపాలల్లోనే ఉత్సవాలను జరుపుకోవటం, ఉత్సవ ప్రదేశాన్ని కనుక్కోవటంలో భర్తలను వివేకహీనులను చేయటం, ఇందులో వటీరావు విచిత్ర
సాహిత్య విమర్శ
591