సూరి, సీత, వెంకి కొబ్బరాకు, పాతగుడ్డలు, పళ్ళు మొదలైన వాటితో బొమ్మలు చేసి బొమ్మరిల్లు నడిపి బొమ్మల పెళ్ళి చేయటం, 'బొమ్మరిల్లు' కథావస్తువు. భట్రాజు వచ్చి రకరకాల పద్యాలు పూసపాటి విజయ రామరాజుల మీద చాటువులు చెప్పి 'గువ్వల చెన్న' మొదలైన పద్యాలు చదవటం, చివరకు సూరి సీత వెంకి తమ మీద పద్యాలు చెప్పించుకొని సంతోషించటం. భట్రాజుకు బియ్యం పెట్టటం, 'భట్రాజు'లోని కథావస్తువు. ముగ్గులు, గొబ్బిళ్లు పెట్టటం హరికథకులు వచ్చి పాటలు పాడడం, సూరి, సీత, వెంకి నానారకాల పిండివంటలు చేయించుకోవడం, భోజనానంతరం సాయంత్రం కొత్త కొత్తగుడ్డలు కట్టుకొని సంతోషంతో పండుగ చేసుకోవటం 'సంకురాత్రి' కథావస్తువు.
విదేశీ వస్తు బహిష్కరణోద్యమం సాగుతున్నపుడు తల్లితో పాటు పాల్గొంటున్న పిల్లలు “గాంధీజీ కి జై!” అని కేకలు పెట్టినందుకు తల్లితోపాటు సూరి, సీత, వెంకిలను మాజిస్ట్రేటు జైలులో వేయటం, వాళ్ళ ప్రవర్తనను, శీలాన్ని, శ్రమాధిక్యాన్ని గమనించి మాజిస్ట్రేటు భార్య జైలులో వేసినందుకు భర్తతో పోట్లాడటం, 'జైలు ప్రవేశం' కథావిశేషాలు. కందిపప్పు, బెల్లం మొదలైనవి తెచ్చుకొని బొమ్మలు పెట్టుకొని ముద్దుగా మాట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ సూరి సీత వెంకి గుజ్జన గూళ్ళు ఆడుకోవటం 'గుజ్జనగూళ్ళు' కథావస్తువు. వినాయక చవితినాడు పూజకోసం సమస్తయత్నాలు చేసుకొని ప్రారంభానికి సన్నద్ధులైన సమయంలో, తండ్రి తమ్ముడికి కొడుకు పుట్టాడన్న పురిటి వార్త వస్తే పిల్లలయిన సూరి సీత వెంకి వెధవ ఉత్తరం వచ్చిందని అనుకోటం 'వెధవ ఉత్తరం' కథావస్తువు.
పెద్ద పులివేషం వేయాలని తండ్రి పంచె ఒకటి తెచ్చి తడిపి బొగ్గులు, సుద్ద, పసుపు పూసి పాడు చేసినందుకు అమ్మ పిల్లలను కొట్టడం 'అమ్మ నన్నెందుకు కొట్టాలి?' కథావస్తువు. సూరి సీత వెంకి జైలులో ఆడుకుంటుంటే తండ్రితో వచ్చిన సూపర్నెంటు కుమార్తె వీళ్ళకు పరిచితురాలై స్నేహం ముదిరి ఇంటికి రానని తండ్రితో వ్యతిరేకించటం, తండ్రి బలవంతంగా తీసుకొని వెళితే పిల్ల ఏడుస్తుండటంతో సూపర్నెంటు భార్య సూరి సీత వెంకిలని తమ పిల్లలకోసం ఇంటికి తీసుకొని రమ్మని అడిగి తెప్పించటం, అంత చిన్న పిల్లలను జైలులో పెడుతున్న ప్రభుత్వం తెలివితేటల్ని జనసామాన్యం పరిహసించటం, సూపర్నెంటు భార్య భర్త చేత పైకి వ్రాయించి పిల్లలను వదలిపెట్టించమని కోరటం, సూరి సీత వెంకి జైలులో నుంచి బయటపడటం, 'సూపరెంటెండెంటు కూతురు' కథావస్తువు. వినాయక చవితినాడు పాలవెల్లి కడుతుండే దాన్ని క్రింద పడవేసినందుకు తండ్రి కోప్పడ్డాడని, తండ్రి కొట్టాడని అందుకు నాన్న
590
వావిలాల సోమయాజులు సాహిత్యం-4