దేవత 'ఉంటామో' యను స్వప్నదేవతలుండియున్నారని మఱికొంత కాలమునకుఁ
జదివి నేర్చుకొంటిని. నిజము! సమస్తశక్తులును దేవతలు కదా! నిద్ర యొక శక్తి!
ఒక దేవత!!
నిద్ర సృష్టియందొక విచిత్రమైన సృష్టి. 'అది దుప్పటి వంటిది. దానిఁగప్పుకొన నవసరము లేని వ్యక్తి యెవఁడు? నిద్రయన్నాతురున కాహారము, తృష్ణాతురునకు దాహము, శీతోష్ణబాధితుల కది యుష్ణము, శీతము; మిత్రరహితులకు మిత్రము, నిలయవిహీనులకు నీడము, మనోబాధితులకు మహనీయాంజనము. ఇన్ని సుగుణములు గల్గియు నిది మృత్యువును బోలి యుండుట యొక్కటియే యిందలి దోష' మని యొక జిజ్ఞాసు వభిప్రాయ మిచ్చినాఁడు.
చంపుట తప్ప మృత్యువొనర్చు సర్వకృత్యములఁ గావించుటకు నిద్ర సమర్థమైనది. మృత్యువుతో నిద్ర కున్న సహజ బాంధవ్యమును గుర్తించిన యొక భావుకుఁడు 'నిద్ర యొక జాతి మృత్యువు; నిరయము దాని జన్మభూమి; అయ్యు నరకము దీనిని దఱిమి వేసినది స్వర్గము చేరనీయలేదు' అని పలికినాఁడు. దీనిని బట్టి నిద్రకు నివాసభూమి 'త్రిశంకు స్వర్గ' మన్నమాట!
నిద్రామృత్యువుల కొక ధర్మసామ్యమున్నది. ఇవి రెండు నావహించి నపు డాత్మకు స్వాతంత్య్రము లభించును. రెంటియందును శరీరి విముక్తుఁడగును. ఈ కారణముననే పెద్దలు నిద్రామృత్యువులఁ గూర్చిన నిండు విజ్ఞానము కలవాఁడు పరమ వివేకియని పలికినారు.
‘మన జన్మమే యొక నిద్ర; ఒక విస్మృతి' జన్మయను నిద్రలో నాత్మ నిజదేశమును వదలి సుదూరము వచ్చుచున్నాఁ'డని యాంగ్ల తాత్విక మహాకవి వర్డ్సువర్తు ప్రవచించినాఁడు. ఇట్లు వచ్చిన ప్రాణి విజ్ఞానియును గాఁడు; అజ్ఞానియును గాఁడు. సర్వకాలములందతనికిఁ తన నిజస్వరూపమును గుర్తించుటకుఁ దగు నవకాశము లున్నవి. అన నతనికిఁ బ్రత్యభిజ్ఞావకాశమున్న దన్నమాట!
'నిద్ర తంద్ర భయము క్రోధ మాలస్యము దీర్ఘసూత్రతల వలన లక్ష్మి సంప్రాప్తింప' దని యార్యోక్తి. దీనినిబట్టి దురదృష్ట హేతువులలో నిద్ర యొకటగు చున్నది. అంత మాత్రమున నిద్ర దరిద్ర హేతువని నిర్ణయింప వీలుకాదు; పనికిరాదని పరిహరింపఁ బొసఁగదు. నిద్ర ప్రాణాధారమనియు నది లేకున్న నారోగ్య వినాశన
మగుననియు 100[1]నార్యక్షేమేశ్వరుని యభిప్రాయము. "నిద్ర మనోమాలిన్యమును క్షాళన- ↑ 100. ఆర్యక్షేమేశ్వరుఁడు (క్రీ.శ. 10వ శతాబ్ది ప్రాంతము) నిద్ర మనోమాలిన్యము -
"చిత్తం ప్రసాదయతీ లాఘవ మాదధాతి
ప్రత్యంగ ముజ్జ్వలయతి ప్రతిభావిశేషమ్ |
దోషా నుదస్యతి కరోతి చ ధాతుసామ్యం
ఆనంమర్పయతీ యోగవిశేష గమ్యం ॥
____________________________________________________________________________________________________
మణిప్రవాళము
59